Home » ‘అఖండ’ అరుదైన రికార్డు.. దేశంలోనే ఈ ఫీట్ అందుకున్న హీరో బాల‌య్య‌..!

‘అఖండ’ అరుదైన రికార్డు.. దేశంలోనే ఈ ఫీట్ అందుకున్న హీరో బాల‌య్య‌..!

by Anji
Ad

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో మాస్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన యాక్ష‌న్ సినిమా అఖండ‌. ఈ సినిమాలో ప్ర‌గ్యాజైస్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు, శ్రీ‌కాంత్‌, పూర్ణ వంటి న‌టీన‌టులు కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీత‌మందించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య గ‌త ఏడాది డిసెంబ‌ర్ 02న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై మంచి వ‌సూళ్ల‌నే రాబ‌ట్టింది. ఈ డిజిట‌ల్ యుగంలో ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న‌ది.వంద రోజుల వేడుక‌కు అభిమానులు వేలాదిగా త‌ర‌లివ‌చ్చారు. ఈ రోజుల్లో 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు, 175 రోజులు, 200 రోజులు ఇలాంటి పోస్ట‌ర్స్ ఒక‌ప్పుడు క‌నిపించేవి. కానీ గ‌త ప‌దేళ్ల కాలం నుంచి అస‌లు కనిపించ‌డం లేదు. ఒక‌ప్పుడు త‌మ అభిమాన హీరో సినిమా 100 రోజులు ఆడింద‌ని గ‌ర్వంగా చెప్పుకునే వారు.


ప్ర‌స్తుతం మా హీరో సినిమా ఫ‌స్ట్ వీక్‌లోనే ఇన్ని వంద‌ల కోట్ల‌ను వ‌సూలు చేసింద‌ని చెప్పుకుంటున్నారు. ఈ స‌మ‌యంలో మూడు వారాలు ఆడిందంటే చ‌రిత్ర‌లో నిలిచిపోవ‌డం ఖాయం. ఇలాంటి ప‌రిస్థితిలో బాల‌య్య అఖండ 50 రోజులు, ఆ త‌రువాత 100 రోజులు ఇప్పుడు ఏకంగా 175 రోజులు పూర్తి చేసుకోవ‌డం విశేషం. ఈ సినిమా 50వ రోజు 103 థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌బ‌డ‌డం ఓ రికార్డు అనే చెప్పాలి. ఇక ఆ త‌రువాత సెంచ‌రీ పూర్తి చేసుకుని హిస్ట‌రీ రిపీట్ చేసింది. ఈ సినిమా 20 థియేట‌ర్ల‌లో 100 రోజులు పూర్తి చేసుకుంది. అందులో 4 కేంద్రాల్లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. ఈ సినిమా తాజాగా 175 రోజులు పూర్తి చేసుకుంది. గుంటూరు జిల్లా చిలుక‌లూరి పేట రామ‌కృష్ణ థియేట‌ర్‌లో ఈ సినిమా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది.

Advertisement

Advertisement


ఇక డిజిట‌ల్ యుగంలో ఓ సినిమా థియేట‌ర్‌లో సిల్వ‌ర్ జూబ్లీ పూర్తి చేసుకోవ‌డం అది కూడా మొత్తంగా గ‌త ప‌దేళ్ల‌లో ఒక హీరో సినిమా 100 రోజుల‌తో పాటు ఏకంగా ఒక కేందంలో 175 రోజులు పూర్తి చేసుకోవ‌డం మ‌న దేశంలో బాల‌య్య‌కు మాత్ర‌మే సాధ్యం అయింద‌నే చెప్పాలి. బాలకృష్ణ సినిమాల‌కు తెలంగాణ‌, ఏపీ కంటే సీడెడ్ లో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంటుంది. బాల‌కృష్ణ చిత్రాల‌కు ఎక్కువ‌గా క‌లెక్ష‌న్లు కూడా ఈ ఏరియాల్లోంచి వ‌స్తుంటాయి. డిజిటల్ యుగంలో ఒక సినిమా ఓ థియేటర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోవడం అది.. మొత్తంగా గత పదేళ్లలో ఒక హీరో సినిమా 100 రోజులతో పాటు ఏకంగా ఒక కేంద్రంలో 175 రోజులు పూర్తి చేసుకోవడం మన దేశంలో బాలయ్యకు మాత్రమే కాసాధ్యమైందనే చెప్పాలి. బాలయ్య సినిమాలకు తెలంగాణ, ఏపీల కంటే సీడెడ్ (రాయలసీమ)లో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. బాలయ్య చిత్రాలకు ఎక్కువ వసూళ్లు ఈ ఏరియాల్లోంచే వస్తుంటాయి.


బోయ‌పాటి శ్రీ‌ను-బాల‌య్య కాంబోలో వ‌చ్చిన రెండ‌వ సినిమా లెజెండ్ సినిమా క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లా సెంట‌ర్స్‌లో 400 రోజుల‌కు పైగా న‌డిచింది. క‌డ‌ప‌లోని ఓ సెంట‌ర్‌లో అయితే ఏకంగా 1000 రోజుల‌కు పైగా ప్ర‌ద‌ర్శించార‌ను. ఇక సౌత్ సినీ ఇండస్ట్రీలోనే ఏ హీరోకు కూడా ఈ రికార్డు లేదు. అఖండ సినిమా ఎమ్మిగ‌నూరులో 100 రోజులు పూర్తి చేసుకోనున్న‌ది. ఈ సెంటర్‌లో ఏకంగా 11 సినిమాలు బాల‌కృష్ణ‌వి డైరెక్ట్ 4 షోల‌తో కంటిన్యూ 100 రోజులుగా పైగా ఆడి రికార్డు సృష్టించాయి. బాల‌కృష్ణ న‌టించిన స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు వంటి సినిమాలు సిల్వ‌ర్ జూబ్లీ జ‌రుపుకున్నారు. ఇక లెజెండ్ ఏకంగా421 రోజులు న‌డిచి హిస్ట‌రీ తిర‌గ‌రాసింది. అఖం ప్ర‌పంచ వ్యాప్తంగా 95.55కోట్ల షేర్‌.. రూ.200 కోట్ల వ‌ర‌కు గ్రాస్ వ‌సూలు సాధించిన‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

Also Read : 

40 ఏళ్లు దాటినా సుబ్బ‌రాజు ఇంకా ఎందుకు పెళ్లికి దూరంగా ఉన్నాడో తెలుసా..!

బాల‌కృష్ణ‌ కూతురుగా న‌టించ‌నున్న ఆ యంగ్ హీరోయిన్‌..!

 

 

Visitors Are Also Reading