Telugu News » Blog » 40 ఏళ్లు దాటినా సుబ్బ‌రాజు ఇంకా ఎందుకు పెళ్లికి దూరంగా ఉన్నాడో తెలుసా..!

40 ఏళ్లు దాటినా సుబ్బ‌రాజు ఇంకా ఎందుకు పెళ్లికి దూరంగా ఉన్నాడో తెలుసా..!

by AJAY
Ads

టాలీవుడ్ లో మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నవారిలో సుబ్బ‌రాజు కూడా ఒక‌రు. ఎలాంటి రోల్ లో అయినా సుబ్బ‌రాజు జీవించేస్తారు. త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటారు. పాజిటివ్ నెగిటివ్ ఇలా పాత్ర ఏదైనా సుబ్బ‌రాజు చాలా ఈజీగా న‌టించేస్తారు. సీరియ‌ల్ లుక్ లోనే క‌నిపిస్తూ కామెడీని కూడా పండించగలుగుతాడు. మిర్చి సినిమాలో మొద‌ట నెగిటివ్ పాత్ర‌లో సుబ్బరాజు క‌నిపిస్తాడు. కానీ ఆ త‌ర‌వాత ప్ర‌భాస్ సుబ్బరాజును పూర్తిగా మార్చేస్తాడు.

ఈ క్ర‌మంలో సుబ్బ‌రాజు బ్ర‌హ్మానందం మ‌ధ్య ఉండే కామెడీ స‌న్నివేశాలు ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. అంతే కాకుండా క‌లేజా సినిమాలో కూడా సుబ్బ‌రాజు పాత్ర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇదిలా ఉండ‌గా సుబ్బ‌రాజు సినిమా జీవితం గురించి తెలుసు కానీ ఆయ‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి మాత్రం ఎవ‌రికీ తెలియ‌దు. న‌టుడిగా ఎంతో స‌క్సెస్ అయిన సుబ్బ‌రాజు వ‌య‌సు 45 సంవ‌త్స‌రాలు.

కానీ సుబ్బ‌రాజు వివాహం మాత్రం చేసుకోలేదు. ఏజ్ పెరిగినా సుబ్బ‌రాజు వివాహం ఎందుకు చేసుకోలేదు అనే డౌట్ చాలా మందికి ఉంది. ఇదే ప్ర‌శ్న ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో కూడా సుబ్బ‌రాజుకు ఎదురైంది. సుబ్బ‌రాజు ఇంకా ఎందుకు వివాహం చేసుకోలేదు అని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. పెళ్లి ఎందుకు చేసుకోవాలో త‌న‌కు అర్థం కావ‌డం లేదన్నారు. పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం కూడా ఉండ‌ద‌ని చెప్పారు. అంతే కాకుండా త‌న‌కు పెళ్లి అవ‌స‌రం రాలేద‌ని చెప్పారు.

పెళ్లి జ‌ర‌గ‌టం వేర‌ని చేసుకోవ‌డం వేర‌ని అన్నారు. పెళ్లి చేసుకోవ‌డం అంటే అది అవ‌స‌రం అని పెళ్లి జ‌ర‌గ‌టం అంటే అది బ‌ల‌వంతంగానో పెద్ద‌ల కోసమే పెళ్లి అవ్వ‌డ‌మేన‌ని చెప్పారు. పెద్ద‌ల‌కోసమో ఏదో వ‌స్తుంద‌ని పెళ్లి చేసుకోవ‌డ‌మో చేస్తే దానిని తాను పెళ్లి అనే భావించ‌న‌ని చెప్పారు. పెళ్లి అంటే ఇవ్వ‌డం అని లైఫ్ లాంగ్ త‌న‌ను తాను పూర్తిగా ఇవ్వ‌గ‌ల‌ను అనిపించిన‌ప్పుడు పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పారు.


You may also like