Home » బాల‌కృష్ణ‌ కూతురుగా న‌టించ‌నున్న ఆ యంగ్ హీరోయిన్‌..!

బాల‌కృష్ణ‌ కూతురుగా న‌టించ‌నున్న ఆ యంగ్ హీరోయిన్‌..!

by Anji
Ad

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ హీరోల్లో ఒక‌రైన నంద‌మూరి బాల‌కృష్ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇక అఖండ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నారు. బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన ఈ సినిమా బాలయ్య సూప‌ర్ హిట్ మూవీల్లో ఒక‌టిగా నిలిచింది.

Advertisement

అఖండ పేరు చెప్ప‌గానే థ‌మ‌న్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఫ్యాన్స్‌కు ఎప్ప‌టికీ గుర్తు వ‌స్తుంటుంది. ఆ సినిమా హిట్ కొట్టిన జోష్‌లో బాల‌య్య వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా సెట్స్‌పై ఉండ‌గా.. ఆ త‌రువాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు.

Advertisement

బాల‌య్య‌- అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో వ‌చ్చే సినిమాకు సంబంధించి సినీ ఇండ‌స్ట్రీలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుంది. పెళ్లి సంద‌D సినిమాతో టాలీవుడ్‌కు పరిచ‌యం అయిన యంగ్ హీరోయిన్ శ్రీ‌లీల అనిల్ మూవీలో బాల‌య్య కూతురుగా ఛాన్స్ కొట్టేసిన‌ట్టు స‌మాచారం. ఇక పెళ్లి సంద‌D సినిమాతో మంచి మార్కులే తెచ్చుకున‌ శ్రీ‌లీల ప్ర‌స్తుతం ర‌వితేజ ద‌మాకా సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుంది. ఈ త‌రుణంలో బాల‌కృష్ణ సినిమాలో కూడా ఆమె ఛాన్స్ కొట్టేసిన‌ట్టు టాక్ వినిపిస్తోంది.


ఇక అనిల్ రావిపూడి బాల‌కృష్ణ‌తో తాను చేయ‌బోయే మూవీ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని గ‌తంలో ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే. బాల‌య్యను భిన్న‌మైన రోల్‌లో చూపిస్తాన‌ని చెప్పారు. తండ్రి-కూతుర్ల అనుబంధానికి సంబంధించిన క‌థాంశంతో అనిల్ రావిపూడ్ ప్లాన్ చేశార‌ని, అందుకే శ్రీ‌లీల‌కు బాల‌య్య కూతురిగా క్యారెక్ట‌ర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.  ప్ర‌స్తుతం ఎఫ్‌-3 మూవీ ప్ర‌మోష‌న్‌ల‌లో బిజీగా ఉన్న ఆయన ఆ సినిమా విడుద‌లైన త‌రువాత బాల‌య్య సినిమాను ప‌ట్టాలెక్కించే అవ‌కాశం ఉంది.

Also Read : 

వారి పై ధనుష్ 10 కోట్ల పరువు నష్టం దావా..?

‘జగ్‌ జగ్‌ జీయో’ ట్రైలర్ చూస్తే న‌వ్వు ఆపుకోలేరు..!

 

Visitors Are Also Reading