Home » అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ముక్కు అవినాష్..!

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ముక్కు అవినాష్..!

by Anji
Ad

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు కమెడియన్ ముక్కు అవినాష్ ఒకరు. ఆయన ఏ కామెడీ చేసినా తన ముక్కు మీదనే సెటైర్లు వేస్తూ హాస్యాన్ని పండిస్తారు. స్టేజ్ పై ఉండే మిగతా కమెడీయన్స్ కంటే తన ముక్కు పెద్దగా ఉండటంతో ముక్కు అవినాష్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అలా అవినాష్ పటాస్, జబర్దస్త్ వంటి కామెడీ షోలతో పాటు కమెడీయన్ గా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకొని సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు.

Advertisement

ఇదిలా ఉంటే.. ప్రముఖ రియాల్టీ షో అయినటువంటి బిగ్ బాస్ షోలో కూడా కంటెస్టెంట్ గా అడుగుపెట్టి అవినాష్ ఆ షోలో హడావిడి అంతేకాదు.. ఇక ఆ షోలో బోల్డ్ యాంకర్ అరియానాతో ప్రేమాయణం సాగించి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ రేంజ్ లో వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నారు. కానీ అనూహ్యంగా అవినాష్ అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన తరువాత అనూజ అవినాష్ తో కలిసి స్టామ్ మా లో ప్రసారం అయ్యే ఇస్మార్ట్ జోడి లో పాల్గొన్నారు. ఇక ఈ విషయాలన్నింటిని పక్కడ పెడితే తాజాగా అవినాష్ గురించి ఓ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నాడు.

Advertisement

తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అనూజ నేను త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామని.. త్వరలో మా ఇంటికి బుల్లి పాపనో, బాబో రాబోతున్నాడు అంటూ.. చాలా సంతోషంగా ఉందని ఈ విషయాన్ని బయటపెట్టరు. ప్రస్తుతం అనూజకి నాలుగో నెల అని.. మూడు నెలలు దాటేంత వరకు డాక్టర్ ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకండి అని అనడంతో మేము పేరెంట్స్ అవ్వబోతున్న ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాం. మేము తల్లిదండ్రులం అవ్వబోతున్నాం అనే గుడ్ న్యూస్ మాకంటే ఎక్కువగా మా తల్లిదండ్రులకు మా అత్తమామలకే సంతోషాన్ని కలిగిస్తుంది. అంటూ అవినాష్ ఓ వీడియో ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్లు అవినాష్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆ హీరోయిన్ మైకంలో పడి రవితేజ తన భార్యకి విడాకులు ఇవ్వాలనుకున్నాడా..? 

మోహ‌న్‌బాబు మొద‌టి భార్య గురించి ఎవ‌రికీ తెలియ‌ని ర‌హ‌స్యం ఇదే..!

ఆ సినిమాలో నటించడం వల్లనే సౌందర్యకి అలా జరిగిందా..? విస్తుపోయే విషయాలు వెలుగులోకి..!

Visitors Are Also Reading