Home » మోహ‌న్‌బాబు మొద‌టి భార్య గురించి ఎవ‌రికీ తెలియ‌ని ర‌హ‌స్యం ఇదే..!

మోహ‌న్‌బాబు మొద‌టి భార్య గురించి ఎవ‌రికీ తెలియ‌ని ర‌హ‌స్యం ఇదే..!

by Anji
Ad

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క‌లెక్ష‌న్ కింగ్‌గా డైలాగ్ కింగ్‌గా పాపులారిటీ సంపాదించుకున్న సీనియ‌ర్ హీరో మంచు మోహ‌న్ బాబు గురించి అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న సినిమాల్లోకి రాక‌ముందు ఆయ‌న పేరు భ‌క్త‌వ‌త్స‌లం నాయుడు. ఇక ఆయ‌న సినిమాల్లోకి వ‌చ్చిన త‌రువాత నటుడిగా స్క్రీన్ పేరు వేయాల‌నుకున్న‌ప్పుడు ఈ పేరు కంటే మ‌రో పేరు అయితే బాగా రాణిస్తాడ‌నే ముందు చూపుతో స్టార్ డైరెక్ట‌ర్‌గా ఓ వెలుగు వెలిగిన ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు మోహ‌న్ బాబు అని పేరు మార్చారు. మోహ‌న్ బాబు పేరు మారి నేడు ఇదే పేరుతో దేశం మొత్తం పాపుల‌ర్ న‌టుడిగా విద్యాసంస్థ‌ల అధినేత‌గా, నిర్మాత‌గా కొన‌సాగుతున్నారు.

Advertisement

ఆయ‌న పేరు మాదిరిగానే ఆయ‌నకి మొద‌టి భార్య‌కి సంబంధించిన విష‌యాలు చాలా మందికి తెలియ‌వక‌పోవ‌చ్చు. సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో మోహ‌న్ బాబుకి విద్యాదేవితో పెళ్లి జ‌రిగింది. వీరి సంతానంగా మంచు విష్ణు, లక్ష్మీ పుట్టారు. ఆ త‌రువాత మోహ‌న్ బాబు వ‌రుస‌గా సినిమా అవ‌కాశాలు వ‌స్తుండ‌డంతో చాలా బిజీ ఆర్టిస్ట్‌గా మారారు. అదే స‌మ‌యంలో మోహ‌న్ బాబు షూటింగ్ ముగించుకొని ఇంటికి ఆల‌స్యంగా వ‌చ్చే వార‌ట‌. అది భార్య విద్యాదేవికి అంత‌గా న‌చ్చేది కాద‌ట‌. ఈ త‌రుణంలో ఇద్ద‌రి మ‌ధ్య చిన్న‌పాటి గొడ‌వ‌లు జ‌రిగేవ‌ట‌. దీంతో ఓ రోజు ఆమె గొడ‌వ‌లో భాగంగా బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చేసుకుంది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  జీవితంలో చేయిప‌ట్టుకుని నడిపించే ఓ తోడు కావాలి..రేణూ దేశాయ్ ఎమోష‌న‌ల్ కామెంట్స్..!

ఇక ఆ స‌మ‌యంలో విష్ణు, ల‌క్ష్మీ చిన్న పిల్ల‌లు కావ‌డంతో వారికి త‌ల్లి లేని లోటు ఉండ‌కూడ‌ద‌ని మోహ‌న్‌బాబుకి న‌చ్చ‌జెప్పి విద్యాదేవి సోద‌రి నిర్మలాదేవితో పెళ్లి జ‌రిపించార‌ట‌. ఆ త‌రువాత వీరికి మ‌నోజ్ పుట్టాడు. ఇక నిర్మ‌లాదేవి ఎలాంటి బేధ‌భావం లేకుండా అక్క పిల్ల‌లు అయినా విష్ణు, ల‌క్ష్మీల‌ను మ‌నోజ్‌తో స‌మానంగా చూస్తోంది. ఇక మోహ‌న్ బాబు కెరీర్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న మాత్రం ప్రేక్ష‌కుల్లో చాలా త‌క్కువ మందికి తెలిసిన విష‌య‌మ‌నే చెప్పాలి. తొలుత అతికోపం ఉన్న మోహ‌న్ బాబు నిర్మ‌లాదేవితో పెళ్లి జ‌రిగిన త‌రువాత క్ర‌మక్రంగా కోపం త‌గ్గింది. ఇక ఏ విష‌యాన్ని అయినా స‌రే మోహం మీదే మాట్లాడేత‌త్వం మాత్రం ఇప్ప‌టికీ మార‌లేదు.

ఇది కూడా చ‌ద‌వండి : భూమా మౌనిక‌తో రెండో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన మ‌నోజ్‌..!

Visitors Are Also Reading