Home » ఓటీటీలోకి అవతార్ 2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఓటీటీలోకి అవతార్ 2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

by Anji
Ad

అవతార్ 2 సృష్టించిన రికార్డుల ప్రభంజనం గురించి దాదాపు అందరికీ తెలిసినదే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కనివినీ ఎరుగనీ వసూళ్లను సాధించింది. యావత్ సినీ ప్రపంచాన్ని మంత్ర ముగ్దులను చేసింది. తెలుగులో కూడా దాదాపు రూ.60 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగులో అత్యధిక వసూళ్లను సాధించిన డబ్బింగ్ చిత్రంగా దీనినే చెబుతున్నారు. అలాంటి సినిమా ఓటీటీలో ఎప్పుడూ అందుబాటులోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి శుభవార్త అనే చెప్పాలి. 

Also Read :  అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా ? 

Advertisement

హాలీవుడ్ స్టార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెలలోనే ఈ చిత్రం ఓటీటీలోనే సందడి చేయబోతుంది. మార్చి 28న డిజిటల్ స్క్రీన్స్ పై ప్రేక్షకులను అలరించనుంది అవతార్ 2. తాజాగా సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. ప్రముఖ ఓటీటీ  ప్లాట్ ఫామ్స్ అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ తదితర వాటిలో అవతార్ 2 స్ట్రీమిండ్ కాబోతుంది.

Advertisement

Also Read :  బ్రేక్ ఫాస్ట్ లో ఈ జ్యూస్ లు తాగితే బరువు తగ్గడం పక్కా..!

Avatar 2 Movie Review: 'అవతార్-2' మూవీ రివ్యూ {4/5} | Avatar 2 Movie Review  and Rating in Telugu {4/5}

4 కే అల్ట్రా హెచ్ డీ, డాల్బీ అట్మాస్ ఆడియోతో మూవీ అందుబాటులోకి రానుంది. తొలుత కొద్ది రోజుల పాటు వీడియో ఆన్ డిమాండ్ లేదా అద్దె ప్రాతిపదికన ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే 2009లో విడుదలైన అవతావర్ కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఫస్ట్ పార్ట్ పండోరా గ్రహంలో సాగగా.. సెకండ్ పార్ట్ స్టోరీని నీటి ప్రపంచంలో నడిపించారు. జేమ్స్ కామెరూన్. ఇంకెందుకు ఆలస్యం మార్చి 28న అవతార్ 2 ని వీక్షించండి.

Also Read :  నందమూరి తారకరత్న చేసిన తప్పే మంచు మనోజ్ చేస్తున్నాడా ? అసలు ఏం జరగబోతుంది..!

Visitors Are Also Reading