Home » ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడిన సచిన్ కొడుకు.. అరుదైన రికార్డు కొట్టేశాడు!

ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడిన సచిన్ కొడుకు.. అరుదైన రికార్డు కొట్టేశాడు!

by Bunty
Ad

 

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని అందుకుంది. ఎట్టకేలకు టాపార్డర్ బ్యాటర్లు మెరుపులు మెరిపించడంతో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ దుమ్మురేపడంతో ఐపీఎల్ లో ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై అయిదు వికెట్ల తేడాతో కోల్కత్తా నైట్ రైడర్స్ ను చిత్తు చేసింది. తోలుతా కోల్కత్తా 20 ఓవర్లలో 185/6 స్కోర్ చేసింది.

read also : Sanghavi : ఆ డైరెక్టర్ తో హీరోయిన్ సంఘవి ఎఫైర్ …?

Advertisement

‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ వెంకటేష్ అయ్యర్ ఈ సీజన్ లో నమోదు చేసిన వేగవంతమైన సెంచరీ వృధా అయ్యింది. ఈ మ్యాచ్ తో ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన సచిన్ తనయుడు అర్జున్ అరుదైన ఘనత సాధించాడు. అన్ క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ అయిన అర్జున్ టెండూల్కర్ ను ముంబై ఇండియన్స్ 2021 లో కనీస ధరకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు ఎదురుచూసిన అర్జున్ ఎట్టకేలకు కోల్కత్తా తో మ్యాచ్లో ఐపీఎల్ లో అడుగు మోపాడు.

Advertisement

Read Also : IPL 2023 : అవేష్ ఖాన్ ను బాగా ఆడుకున్న హైదరాబాద్ పోలీసులు

ఐపీఎల్‌లో మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్న సచిన్ కొడుకు అర్జున్

ఈ మ్యాచ్ లో తొలి ఓవర్ వేసిన అర్జున్ పొదుపు గానే పరుగులు ఇచ్చాడు. అయితే రెండో ఓవర్ లో కాస్తన్ని ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు. రెండు ఓవర్లు మాత్రమే వేసిన జూనియర్ టెండూల్కర్ 17 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ లో నిజానికి బెస్ట్ ఫిగర్సే. అర్జున్ మైదానంలో అడుగు పెడుతూనే అత్యంత అరుదైన రికార్డును తన పేర రాసుకున్నాడు. తండ్రి తర్వాత కుమారుడు కూడా అదే ఫ్రాంచైజీకి ఆడడం ఐపిఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఒక ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన తండ్రి, కొడుకులుగా సచిన్, అర్జున్ రికార్డులకు ఎక్కారు.

read also : IPL 2023 : గంగూలీని దారుణంగా అవమానించిన కోహ్లీ..వీడియో వైరల్‌

Visitors Are Also Reading