Home » అనుష్కని కోడలుగా చేసుకోవాలనుకున్న ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

అనుష్కని కోడలుగా చేసుకోవాలనుకున్న ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

by Mounika
Ad

అందాల భామ అనుష్క గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో నాగార్జన సరసన సూపర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ క్రమంలోనే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఫిమేల్ ఓరియంటెడ్ గా తెరకెక్కిన అరుంధతి సినిమాతో విపరీతమైన స్టార్‌డమ్ సంపాదించింది.

Advertisement

ఇక బాహుబలి తర్వాత ఆమె స్టార్‌డమ్ పెరిగినప్పటికీ సినిమా అవకాశాలు మాత్రం తగ్గిపోయాయి. ప్రస్తుతం అనుష్క యంగ్ హీరో నవీన్ పొలిశెట్టికి జంటగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో అనుష్క చెఫ్‌ పాత్రలో కనిపించనుంది. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా అనుష్క ప్రభాస్ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి  చేసుకోబోతున్నారంటూ అనేక వార్తలు ప్రచారం అయ్యాయి.

Advertisement

ప్రస్తుతం అనుష్క గురించి మరో కొత్త వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ విషయం ఏంటో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్య వ్యక్తం చేస్తారు. గతంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అనుష్కని తన ఇంటి కోడల్ని చేసుకోవాలని అనుకున్నారట. తన కుమారుడు ప్రకాష్‌ని పెళ్లి చేసుకుంటావా.. అని అనుష్కని అడిగితే ఆమె సున్నితంగా తిరస్కరించిందట.గతంలో తన కుమారుడు ప్రకాష్‌కు పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చినప్పడు రాఘవేంద్రరావు అనుష్కనే ఆయన ఫస్ట్‌ చాయిస్‌ అనుకున్నారట. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు లేనట్లు అనుష్క రాఘవేంద్రరావుతో చెప్పిందట.

అయన కుమారుడు ప్రకాష్ 2014లో ముంబైకి చెందిన కనికను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2017లో ఈ జంట మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత కూడా మళ్లీ అనుష్క వద్దకు తన కొడుకుని పెళ్లి చేసుకోమని అడగాలని రాఘవేంద్రరావు భావించాడట. కానీ అప్పటికే పెళ్ళై విడాకులు తీసుకున్న తన కొడుకుని చేసుకునేందుకు ఒప్పుకుంటుందా అనే సందేహంతో రాఘవేంద్రరావు ఆగిపోయారట.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

“సరిలేరు నీకెవ్వరూ” సినిమాను ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా? అసలీ కథ ఎవరికోసం రాసారంటే?

“మహేష్ తో ఆ సినిమా మిస్ చేసుకున్నా..” అంటూ పాయల్ కామెంట్స్! ఎప్పటికైనా ఆయనతో చేస్తా అంటూ..

Ram Charan: రామ్ చరణ్ ను చిరు బెల్ట్ తో కొట్టారా? అసలు అప్పుడేమి జరిగింది?

 

Visitors Are Also Reading