Home » Andrew Flintoff : అయ్యో పాపం…ఫ్లింటాఫ్ ఏంటి ఇలా అయిపోయాడు…!

Andrew Flintoff : అయ్యో పాపం…ఫ్లింటాఫ్ ఏంటి ఇలా అయిపోయాడు…!

by Bunty
Ad

 

 

Andrew Flintoff : ఒకప్పుడు ఇంగ్లాండు దిగ్గజ ఆటగాడు ఫ్లింటాఫ్ ఎలా ఉండేవాడో అందరికీ తెలుసు. ఆరడుగుల హైట్, అందుకు తగ్గ బాడి అచ్చం హాలీవుడ్ సినిమాలో హీరోలా ఉండేవాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా మారిపోయాడు. ముఖమంతా వాలిపోయి.. ముక్కు, పెదవుల దగ్గర గాయాలతో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. కార్ రేసింగ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫ్లింటాఫ్ చాలా కాలంగా తన ముఖాన్ని బయట ప్రజలకు చూపించలేదు.

Andrew Flintoff Makes First Public Appearance After His Accident

Andrew Flintoff Makes First Public Appearance After His Accident

తాజాగా ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో కనిపించాడు. అతన్ని చూసి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఏంటి ఐ సినిమాలో విక్రమ్ ల మారిపోయాడంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఇది ఇలా ఉండగా గత సంవత్సరం డిసెంబర్ మాసంలో ఇంగ్లాండు దిగ్గజ ఆటగాడు ఫ్లింటాఫ్…. ప్రముఖ టీవీ ఛానల్ బిబిసి నిర్వహించిన టాప్ గేర్ షోలో ఎపిసోడ్ షూట్ చేస్తుండగా… ఇతని కారుకు ప్రమాదం జరిగింది.

Advertisement

Advertisement

ఈ తరుణంలోనే తీవ్ర గాయాల పాలైన ఇంగ్లాండు దిగ్గజ ఆటగాడు ఫ్లింటాఫ్ ను… ఓ ప్రత్యేక హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఈ సంఘటన అప్పట్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో ఇంగ్లాండు దిగ్గజ ఆటగాడు ఫ్లింటాఫ్ పక్కటెముకలు విరగడమే కాక ముఖం మరియు దవడలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

ఇవి కూడా చదవండి

Mark Antony Review : మార్క్ ఆంటోని రివ్యూ..విశాల్‌ హిట్టు కొట్టాడా ?

 ప్రాణం పోయినా ఈ 9 విషయాలు ఎవరికీ చెప్పకూడదు…! 

‘ఒరేయ్ నియ్యబ్బా..’ అంటూ హీరో గోపీచంద్ పై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు ?

 

Visitors Are Also Reading