Home » Mark Antony Review : మార్క్ ఆంటోని రివ్యూ..విశాల్‌ హిట్టు కొట్టాడా ?

Mark Antony Review : మార్క్ ఆంటోని రివ్యూ..విశాల్‌ హిట్టు కొట్టాడా ?

by Bunty
Ad

Mark Antony Review : తమిళ హీరో విశాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే.. విశాల్, ఎస్ జె సూర్య, సునీల్, రీతు వర్మ ఇలా అందరూ కలిసి చేసిన టైం ట్రావెల్ కథ మార్క్ ఆంటోనీ. ఈ మూవీ టీజర్, ట్రైలర్ కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. దీంతో మూవీ మీద మంచి బజ్ ఏర్పడింది. విశాల్ క్రేజ్ కూడా ఉండటంతో బిజినెస్ కూడా బాగానే జరిగినట్టుంది. విడుదల విషయంలో కాస్త ఉత్కంఠరేగిన కోర్టు నుంచి క్లియరెన్స్ రావడంతో సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. ఇక సోషల్ మీడియాలో మార్క్ ఆంటోనీ సందడి కనిపిస్తోంది.

Mark Antony Review

Mark Antony Review

కథ మరియు వివరణ :

Advertisement

మార్క్ ఆంటోని సినిమా కథ విషయానికి వస్తే.. మార్క్ (విశాల్) ఒక మెకానిక్, తన స్నేహితుడు చిరంజీవి (సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్ మెషిన్ ని కనిపెడతారు. ఆ టెలిఫోన్ మెషిన్ ఏంటి అంటే భూతాకాలంకి ఫోన్ చేసుకోవచ్చు. అయితే మార్క్ తన తండ్రి అయిన ఆంటోనీకి కాల్ చేయాలి అనుకుంటాడు. అయితే మార్క్ తన తండ్రిని చంపాలని అనుకుంటాడు అని తెలియడంతో కథ అడ్డం తిరుగుతుంది. అసలు మార్క్ గ్యాంగ్ స్టర్ అయిన ఆంటోనీని ఎందుకు చంపాలి అనుకున్నాడు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

మార్క్ ఆంటోనీ చిత్రంలో విశాల్, ఎస్ జె సూర్య యాక్టింగ్ గురించి ఎక్కువమంది నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఎస్జె సూర్య నటన క్రేజీగా ఉందని అంటున్నారు. గ్యాంగ్ స్టర్లుగా విశాల్, ఎస్ జె సూర్య చేసిన రెట్రో యాక్షన్ కామెడీ సూపర్ గా ఉందని చాలామంది నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ కాస్త యావరేజ్ గా ఉన్న సెకండ్ హాఫ్ ఫుల్ యాక్షన్ తో అదిరిపోయింది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మార్క్ అంటోనీనీ థియేటర్లలో చూడాలంటూ చాలా మంది రికమెండ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు రవిచంద్రన్ టేకింగ్…మార్క్ ఆంటోనీ చిత్రానికి హైలైట్ అనే కామెంట్స్ వస్తున్నాయి. రేట్రో స్టైల్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ గా విభిన్నంగా ఎంటర్టైనింగ్ గా మార్క్ ఆంటోనీ చిత్రాన్ని ఆయన తెరకెక్కించారని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. మార్క్ అంటోనీలో సిల్క్ స్మిత క్యారెక్టర్ ను రీక్రియేట్ చేయడం బాగా ప్లేస్ అయిందని నెటిజన్లు అంటున్నారు.

ప్లస్ పాయింట్లు :

దర్శకత్వం
కామెడీ
నటీనటులు

మైనస్ పాయింట్స్

సింపుల్ కథ

సినిమా రేటింగ్ : 2.75/5

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading