Home » ప్రాణం పోయినా ఈ 9 విషయాలు ఎవరికీ చెప్పకూడదు…!

ప్రాణం పోయినా ఈ 9 విషయాలు ఎవరికీ చెప్పకూడదు…!

by Bunty
Ad

 

 

 

ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మి అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు. కొందరికి కొన్ని విషయాలు చెప్పకపోవడమే చాలా మంచిది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనకు సంబంధించిన కొన్ని విషయాలను గోప్యంగా ఉంచుకోవాలి. మనకు కానీ, మన కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలను ప్రాణం పోయినా కూడా ఎవరితో చెప్పుకోకూడదు అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..

Advertisement

# సంపాదన

మనం సంపాదించే సంపాదన గురించి ఎటువంటి పరిస్థితుల్లో స్నేహితులకు కానీ, బంధువులతో కానీ చెప్పుకోకూడదు. ఎందుకంటే మన సంపాదన గురించి చెబితే కొంతమంది ఓర్వలేకపోవచ్చు. అలాగే ఇంకొందరు వీరి సంపాదన ఇంతేనా అని ఎగతాళి కూడా చేస్తారు.

 

# భార్య భర్తల గొడవలు

కుటుంబంలో జరిగే గొడవలు, సమస్యలు గురించి ఎవరితో చెప్పుకోకూడదు. అలాగే భార్యాభర్తల గొడవలు అస్సలు ఎవరితో చెప్పుకోకూడదు. భార్య భర్తల గొడవలు ఎవరితో అయినా చెప్పుకుంటే వాళ్ల దృష్టిలో చులకన అవుతారు.

 

# వయసు

వయసు గురించి ఎవరికీ చెప్పుకోకూడదు. ముఖ్యంగా స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర శాస్త్రం ప్రకారం మన వయస్సు కరెక్టుగా ఇతరులకు చెబితే మన ఆయుషు తగ్గుతుందని పెద్దలు చెబుతారు.

# మంత్రం

మన దగ్గర ఉన్న మంత్రాన్ని ఎవరితో చెప్పుకోకూడదు. అందుకే పంతులు పూజ సమయంలో, కార్యాల సమయంలో మంత్రాన్ని చెప్పేటప్పుడు విని వినిపించినట్లు చెవిలో చెబుతారు.

 

# దానం

Advertisement

మనం దానం చేసిన విషయాన్ని కూడా ఎవరితో చెప్పుకోకూడదు. అందుకే మన పెద్దలు చెబుతూ ఉంటారు. కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదు అని అంటూ ఉంటారు.

 

# సన్మానం

ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంలో సన్మానం జరిగితే ఎవరితో చెప్పుకోకూడదు. ఎందుకంటే మన డప్పుని మనమే కొట్టుకున్నట్లు అవుతుంది. మన గురించి, మనకు జరిగిన సన్మానం గురించి ఇతరులు చెబితే పరవాలేదు. కానీ మనమే చెప్పుకోకూడదు.

wife and husband relation

# అవమానం

మనకు ఎప్పుడైనా అవమానం జరిగితే దాని గురించి ఎవరితో చెప్పుకోకూడదు. అలా చెప్పితే వాళ్లు సమయం వచ్చినప్పుడు మనల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది.

 

# ఔషధం

మనం వాడే ఔషధం గురించి ఎవరితోనో చెప్పకూడదు. ఎందుకంటే అది కొందరికి పని చేయవచ్చు, మరికొందరికి పనిచేయకపోవచ్చు. మంచి జరిగితే పరవాలేదు కానీ చెడు జరిగితే నీ మందు వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటారు.

 

# ఆస్తులు

మన దగ్గర ఉన్న హాస్టల్ గురించి కూడా ఎవరితో చర్చించకూడదు. ఎందుకంటే సమాజంలో అందరూ మంచివాళ్లే ఉంటారని అనుకోవడం మన భ్రమ. మనల్ని చూసే అసూయపడే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. కాబట్టి మన ఆస్తుల వివరాలు ఎవరితోనూ చెప్పుకోకూడదు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading