Telugu News » Blog » దూసుకొచ్చిన కుక్క, భయంతో 3వ అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్

దూసుకొచ్చిన కుక్క, భయంతో 3వ అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్

by Bunty
Ads

తెలుగు రాష్ట్రాలలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. ఇటీవల కాలంలో వీధి కుక్కల దాడికి చిన్నపిల్లలు మరణిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాదులో రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక తాజాగా మరో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. డెలివరీ ఇద్దామని ఓ అపార్ట్మెంట్ లోని మూడో ఫ్లోర్ కి వెళ్ళిన డెలివరీ బాయ్ మీదకు ఓ ఇంట్లో నుంచి పెంపుడు కుక్క రావడంతో భయంతో అతను కిందకు దూకాడు. ఈ ప్రమాదంలో డెలివరీ బాయ్ కు గాయాలయ్యాయి.

Advertisement

ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో తాజాగా చోటు చేసుకుంది. మణికొండ పంచవటి కాలనీరో శ్రీనిధి హైట్స్ అపార్ట్మెంట్స్ లోని మూడో ఫ్లోర్ లో డాక్టర్ సుబ్బరామిరెడ్డి నివాసం ఉంటున్నారు. ఓ యాప్ లో ఆయన ఆర్డర్ పెట్టుకున్నాడు. ఆ ఆర్డర్ డెలివరీ చేసేందుకు ఫలక్ నూమాకు చెందిన డెలివరీ బాయ్ మహమ్మద్ ఇలియాజ్ ఆదివారం మధ్యాహ్నం 2.25 గంటలకు అపార్ట్మెంట్ మూడో ఫ్లోర్ కు చేరుకున్నాడు.

Advertisement

ఒక్కసారిగా డాక్టర్ ఇంట్లో నుంచి అతని పెంపుడు కుక్క అరుస్తూ ఇలియాజ్ మీదకు దూసుకెళ్లబోయింది. భయంతో ఇలియాజ్ మూడో ఫ్లోర్ నుంచి కిందకు దూకేశాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అతనికి ఒక కాలు విరిగిపోయిందని బాధితుడు కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని రాయదుర్గం పోలీసులు చెప్పారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Hansika: స్టార్ హీరో డేట్ కు వస్తావా అంటూ వేధించాడు.. హన్సిక సంచలన వ్యాఖ్యలు

The Kerala Story : కేరళ స్టోరి సినిమా చూసి ప్రియుడుపై రే*కేసు పెట్టిన ప్రియురాలు

Advertisement

Ap : రాధ హ* కేసులో ఊహించని మలుపు.. భర్తే హ*కుడు!

You may also like