Home » ఏజెంట్ అట్టర్ ఫ్లాప్… అక్కినేని ఫ్యాన్స్ కు అమల బహిరంగ లేఖ..!

ఏజెంట్ అట్టర్ ఫ్లాప్… అక్కినేని ఫ్యాన్స్ కు అమల బహిరంగ లేఖ..!

by Bunty
Ad

సురేందర్ రెడ్డి యంగ్ హీరో అఖిల్ అక్కినేని కాంబినేషన్ లో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాణ సారథ్యంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాపై అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా అయినా అఖిల్ కు హిట్ ఇస్తుందేమో అని చాలా ఆశపడ్డారు. ఊహించని విధంగా ఏజెంట్ సినిమా అభిమానులకు షాక్ ఇచ్చింది.

READ ALSO : రజనీకాంత్ వాఖ్యాలతో NTR ఆత్మ ఘోషిస్తోంది – రోజా

Advertisement

ఈ సినిమాకు ఓపెనింగ్ అయితే బాగానే వచ్చాయి. కానీ టాక్ మాత్రం మిక్స్డ్ గా వస్తోంది. అఖిల్ కష్టం వృధా అయ్యిందని అంటున్నారు చూసిన ప్రేక్షకులు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం అఖిల్ పడ్డ కష్టం అంతా వృధా అయ్యిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ కి అభిమానిగా ఉండటం కష్టమైపోతుందని పలువురు ట్వీట్స్ కూడా చేశారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి అమలా దగ్గరకు చేరిందని, దీంతో ఆమె అక్కినేని ఫ్యాన్స్ నీ ఉద్దేశిస్తూ ఓ లెటర్ రిలీజ్ చేశారని తెలుస్తోంది.

Advertisement

READ ALSO : చచ్చినా ఆ హీరోయిన్ తో నటించను – ఎన్టీఆర్ సంచలన నిర్ణయం

Agent Movie: 'ఏజెంట్' మూవీ పై అమల ఆసక్తికర కామెంట్స్.. అఖిల్ అక్కినేని అభిమానులకు ఓపెన్ లెటర్ | Akkineni Amala Reacts On Her Son Akkineni Akhil's Movie Agent telugu cinema news | TV9 Telugu

ఇప్పుడు అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ‘ట్రోలింగ్ అనేది ఎప్పుడూ ఉండేదే. ఎందుకు అలా చేస్తారనేది నేను అర్థం చేసుకున్నాను. నిన్న నేను ఏజెంట్ చూశాను. పూర్తిగా ఎంజాయ్ చేశాను. సినిమాలో లోపాలు ఉన్నాయి. కానీ మీరు ఓపెన్ మైండ్ తో చూస్తే ఆశ్చర్యపోతారు. థియేటర్లో నేను మూవీ చూస్తున్న టైం సగం మంది లేడీస్ ఉన్నారు. యాక్షన్ సీన్స్ టైంలో అరుస్తూ, కేకలేస్తూ వాళ్ళు బాగానే ఎంజాయ్ చేశారు. నేను ఒకటే చెప్పగలను. అఖిల్ తర్వాత చేయబోయే సినిమా ఇంకా బాగుంటుంది’ అని అమలా పేర్కొన్నారని సమాచారం.

READ ALSO :   సినిమాలు వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దగ్గుబాటి హీరో… అతను ఎవరో తెలుసా?

Visitors Are Also Reading