టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన అల్లుఅర్జున్ గురించి ఇప్పుడు తెలియని వారే ఉండరు. దాదాపుగా దేశవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పరిచయమే. కేవలం నటన పరంగానే కాకుండా వ్యక్తిత్వ పరంగా కూడా పేరు పొందాడు. అలాంటి అల్లుఅర్జున్ ఒకనొక సమయంలో అవమానించబడ్డాడని ఆయన అభిమానులు ఆవేశాన్ని తెప్పించిన సందర్భం ఒకటి ఉంది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : కరాటే కళ్యాణి రెండు పెళ్లిళ్ల కథ గురించి మీకు తెలుసా..?
2016లో SIIMA అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమానికి అల్లుఅర్జున్ హాజరయ్యాడు. అప్పుడు నానుమ్ రౌడి చిత్రానికి సంబంధించి ఉత్తమ నటిగా నయన తార అవార్డును గెలుచుకున్నారు. ఆమెకు అవార్డు ఇవ్వడానికి అల్లుఅర్జున్‌ను పిలిచారు. అల్లుఅర్జున్ హాజరై అవార్డును అందజేయగా ఆ అవార్డును నయన్ తీసుకొని తనకు నానమ్ రౌడీ చిత్రానికి ఉత్తమ నటిగా SIIMA అవార్డు రావడం సంతోషంగా ఉందని చెప్పారు.
అయితే ఈ అవార్డును మాత్రం దర్శకుడు విఘ్నేష్ శివన్ చేతుల మీదుగా అందుకోవాలని ఉన్నట్టు ఆమె ప్రకటించడంతో అప్పుడు అల్లుఅర్జున్ అభిమానులతో పాటు అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే దర్శకున్ని స్టేజీ పైకి పిలిచింది. అతడు స్టేజీ వద్దకు రాగానే అతన్ని కౌగిలించుకుంది నయన్ తార. ఆ తరువాత నయన్ సంతోషంగా నానుమ్ రౌడి సినిమా గురించి కబుర్లు చెప్పింది. ఆ తరువాత కొద్దిసేపు దర్శకుడు విఘ్నేష్ శివన్ కూడా ముచ్చటించారు.
ఇదిలా ఉంటే ఆ సందర్భంలో అల్లుఅర్జున్‌కు అవమానం జరిగిందని అభిమానులు నయనతారపై కొద్ది రోజులు ఆగ్రహంగా ఉన్నారు. అదే సమయంలో పలు కామెంట్లు కూడా చేశారు. ఇంత జరిగినా అల్లు అర్జున్ మాత్రం సంతోషంగా బాధ్యత వహించడగంతో ప్రేక్షకులు ఆ సమయంలో కొంత మంది నవ్వగా.. మరికొందరికీ అంతులేని ఆగ్రహాన్ని తెప్పించిందట.
Also Read : బాలయ్య చేయాల్సిన సింహాద్రి NTRకు ఎలా వచ్చింది?