Home » క‌రాటే క‌ళ్యాణి రెండు పెళ్లిళ్ల క‌థ గురించి మీకు తెలుసా..?

క‌రాటే క‌ళ్యాణి రెండు పెళ్లిళ్ల క‌థ గురించి మీకు తెలుసా..?

by Anji
Ad

మాన‌వ జీవితంలో పుట్ట‌క‌, చావు అనేవి ఒక్క‌సారే వ‌స్తుంటాయి. ఒక్క‌ సారే పుట్ట‌డం, ఒక్క‌సారే మ‌ర‌ణించ‌డం ప్రతీ జీవి స‌హ‌జ ల‌క్ష‌ణం. అదేవిధంగా వైవాహిక బంధం కూడా ఎవ‌రికైనా ఒక్క‌సారే వ‌స్తుంటుంది. పెళ్లి అనేది ఒక్క‌సారే అన్న ప‌దానికి అర్థంపోయింది. కానీ కొంత మందికి మాత్రం జీవితంలో లెక్క‌లేన‌న్నీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొంత మంది తొలి పెళ్లి చేసుకోగానేవిడాకులు తీసుకొని రెండ‌వ పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తున్నారు. కొంత మంది ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా అదే తీరుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అలాంటి వారిలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ క‌రాటే క‌ళ్యాణి  కూడా ఒక‌రు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో హ‌రిక‌థా కుటుంబానికి చెందిన అమ్మాయి క‌ళ్యాణి. ఆమె చిన్న‌ప్ప‌టి నుంచే హ‌రిక‌థ‌లు చెప్పేవారు. నాట‌క రంగం మీద ఇష్టంతో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో త‌న జీవితంలో జ‌రిగిన పెళ్లిళ్ల గురించి ఆమె చెప్పారు.

Advertisement

Also Read :  ఉద‌య్ కిర‌ణ్‌తో చిరంజీవి త‌న కూతురు పెళ్లి ఎందుకు రద్దు చేసుకున్నాడో తెలుసా..?

Advertisement

ప్రేమ పేరుతో వాడుకొని కొంద‌రూ మోసం చేశార‌ని, త‌న‌కు నిజ‌మైన ప్రేమ మాత్రం ఎక్క‌డ ల‌భించ‌లేద‌ని వాపోయింది. కేవ‌లం అమ్మ అని పిలిపించుకునేందుకు తాను రెండు సార్లు పెళ్లి చేసుకున్నాను అని ఆమె చెప్పింది. భార్య అంటే వండి పెట్టాలి. ఇంట్లో అణిగి ఉండాలి. ఏమి మాట్లాడ‌కూడ‌దు అనే వాళ్లు ఎంతో మంది ఉంటార‌ని, కానీ తాను అలాంటి దాన్ని కాదు అని క‌ళ్యాణి వివ‌రించింది.

తొలుత తాను ప్రేమించిన వ్య‌క్తిని వివాహం చేసుకుని మోస‌పోయాను అని, ఆ త‌రువాత మ‌ళ్లీ పెళ్లి చేసుకున్న వ్య‌క్తి తాను కేవ‌లం ఇంట్లోనే ఉండాల‌ని, త‌న‌కు, త‌న కుమారిడికి వండి పెట్టాల‌న్న కండీస‌న్లు పెడుతూ ఉండేవాడు అని.. అత‌ని ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క‌పోవ‌డంతో తాను విడాకులు ఇచ్చాన‌ని వెల్ల‌డించింది క‌ళ్యాణి. ముఖ్యంగా త‌న భ‌ర్త త‌ర‌చూ తాగి వ‌చ్చి త‌న‌ను కొట్ట‌డంతో పాటు అనుమానించే వాడు అని, ఇలాంటివి భ‌రించ‌లేక‌నే రెండ‌వ భ‌ర్త‌ను కూడా వ‌దిలేశాను అని పేర్కొంది.

ఇలాంటి బాధ‌లు భ‌రించ‌లేక ఒక‌నొక స‌మ‌యంలో తాను చ‌నిపోవాల‌ని కూడా అనుకున్నాన‌ని.. కొన్ని నిద్ర మాత్ర‌లు కూడా మింగాను అని క‌ళ్యాణి ఆవేద‌న‌తో త‌న జీవిత బాధ‌లను పంచుకుంది.

Also Read :  బాల‌య్య చేయాల్సిన సింహాద్రి NTRకు ఎలా వచ్చింది?

Visitors Are Also Reading