Telugu News » Blog » భార్యకి ఇచ్చిన మాట కోసం అన్ని అవమానాలు NTR పడ్డారంటే ?

భార్యకి ఇచ్చిన మాట కోసం అన్ని అవమానాలు NTR పడ్డారంటే ?

by Anji
Ads

ఎన్టీఆర్ ఆ పేరు ఒక ప్ర‌భంజ‌నం. రాజ‌కీయ రంగంలో కూడా త‌న‌దైన ముద్రవేసిన మ‌హానేత నంద‌మూరి తార‌క‌రామారావు. 1981వ సంవ‌త్స‌రంలో కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు రాష్ట్ర ముఖ్య‌మంత్రిని ఢిల్లీలో నిర్వ‌హించ‌డం ఇటువంటి చ‌ర్య‌ల వ‌ల్ల‌నే రాష్ట్ర ప్ర‌జ‌లు ఎంత‌గానో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక అదే స‌మ‌యంలో నంద‌మూరి బ‌స‌వ‌తారకం గారు మీరు రాజ‌కీయాల్లోకి రావాలి. ప్ర‌జ‌లకు న్యాయం చేయడం కోస‌మే అలాగే విలేక‌ర్ల ముందు ప్ర‌క‌ట‌న చేయాలని చెప్పారు. 1981లో స‌ర్దార్ పాపారాయుడు షూటింగ్ విరామంలో ఒక విలేక‌రీ మ‌రో ఆరు నెల‌ల్లో నీరు 60 సంవ‌త్స‌రాలు నిండిపోతున్నాయి. నీ జీవితానికి సంబంధించిన మీరు ఏమైనా కొత్త నిర్ణ‌యాలు తీసుకున్నారా ? ఎన్టీఆర్‌ని అడిగాడు. దానికి స‌మాధానంగా నిమ్మ‌కూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. కానీ తెలుగు ప్రేక్ష‌కులు న‌న్ను ఎంత‌గానో అభిమానించి ఆద‌రించారు. త‌రువాత పుట్టిన రోజు నుంచి ప్ర‌తీ నెల 15 రోజుల పాటు ప్ర‌జా సేవ‌కే నా జీవితాన్ని అంకితం చేస్తాను అని స‌మాధానం ఇచ్చారు.

Advertisement

నంద‌మూరి తార‌క‌రామారావు గారి రాజ‌కీయ ప్ర‌వేశానికి నాంధి అని, బ‌స‌వ‌తార‌కం గారు చెప్పారు. ఆ త‌రువాత ఆయ‌న చేయాల్సింది. చాలా త్వ‌ర‌గా వ‌సూలు చేశారు. 1982 మార్చి 28న ఆయ‌న హైద‌రాబాద్‌కి వ‌చ్చిన‌ప్పుడు రెడ్ కార్పేట్ వేసి మ‌రీ స్వాగ‌తం ప‌లికారు. 1982 మార్చి 28 మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు కొత్త‌గా పార్టీ పెట్ట‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. పార్టీకి తెలుగుదేశం అనే పేరు పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించి అలా టీడీపీ ఆవిర్భావం జ‌రిగింది. ప్ర‌సంగాలు చేశాడు. దానికే చైత‌న్య ర‌థం అని పేరు కూడా పెట్టాడు. ఆ చైత‌న్య ర‌థం నుంచి క‌దిలిరా అనే నినాదంతో చైత‌న్య ర‌థం ప్రారంభించారు. రా క‌దిలిరా తెలుగుదేశం పిలుస్తోంది అనే నినాదంతో ముందుకు సాగారు. అదే నినాదాన్ని ఆ చైత‌న్య ర‌థం మీద రాయించాడు కూడా. ఆ చైత‌న్య‌ర‌థ‌మే ఆయ‌న నివాస స్థ‌లంగా మారిపోయింది.

ఒక్క సామాన్య శ్రామికుడి లాగా కార్మికుడిలా.. ఆత్మ‌ప‌రిర‌క్ష‌ణ అనే ఒక ఉద్వేగనిమిత్త‌మైన విష‌యాన్ని తీసుకొని ప్ర‌జ‌ల్లో చైత‌న్యాన్ని క‌లిగించారు. ఎన్టీఆర్ ఉద్వేగ‌భ‌రితంగా ప‌దే ప‌దే మారుతున్న శాస‌న స‌భ‌ల ఎన్నికలైన తెలుగు వారికి ప్రాముఖ్య‌త లేక‌పోవ‌డాన్ని ముఖ్య‌మైన అన్సార్‌గా చేసుకొని కాంగ్రెస్ నాయ‌కుల‌ను విమ‌ర్శించేట‌ప్పుడు ఘాటైన ప‌దాలే వాడారు. ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని పెంచుతార‌ని అఖిలాంధ్ర ప్రేక్ష‌కులు న‌మ్మారు. 1983జ‌న‌వ‌రి 07న మ‌ధ్యాహ్నం ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌క‌ట‌న జ‌రిగింది. తెలుగుదేశం 199 కాంగ్రెస్ 60, సీపీఐ 4, సీపీఐ (ఎం) 5 బీజేపీ 3 సీట్లు గెలుచుకున్నాయి. అది తెలుగుదేశం పార్టీ ప్ర‌భంజ‌నం అని చెప్ప‌వ‌చ్చు. 90 ఏండ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కేవ‌లం 9 నెల‌ల క్రితం పెట్టిన తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడించింది. టీడీపీ విజ‌యానికి అప్ప‌టి వార్త ప‌త్రిక‌లు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ్డాయి. ఎన్టీఆర్ గెలుపు అయితే భారీ స్థాయిలో సాధించారు. కానీ రాజ‌కీయ జీవితం న‌ల్లేరు మీద‌న‌డ‌క కాలేదు. టూకుటుయ్యాల సాగింది.

Also Read :  గుర్తుపట్టనంతగా మారిపోయిన చందమామ హీరోయిన్….ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా…!

Advertisement

కేంద్రాన్ని ఎదురించ‌డం మొద‌లుపెట్టారు ఎన్టీఆర్‌. అధికారంలోకి వ‌చ్చాక ఎన్నో వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌గ్గింపు, ఈ నిర్ణ‌యాల్లో చాలా ప్ర‌ధాన‌మైన‌ది. అతిత‌క్కువ కాలంలోనే ప్ర‌జాధార‌ణ కోల్పోయారు ఎన్టీఆర్‌. 1984లో నాదెండ్ల భాస్క‌ర్‌రావు ముఖ్య‌మంత్రి అయ్యారు. ఎన్టీఆర్ మ‌ళ్లీ ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. ఆయ‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని వెలుగెత్తి చాటాడు. త‌న‌పైన జ‌రిగిన రాజ‌కీయ కుట్ర అని చెప్పారు. ఇక ఈ స‌మ‌యంలో మిత్ర‌ప‌క్షాలు ఎన్టీఆర్‌కి ఎంత‌గానో స‌హాయం చేశాయి.ఫలితంగా సెప్టెంబ‌ర్ 16న నందమూరి తార‌క‌రామారావు గారిని మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌క‌టించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. కేవ‌లం నెల‌రోజుల కాలంలోనే తిరిగి ముఖ్య‌మంత్రి అయి ప్ర‌భంజ‌నాన్ని సాటిన వ్య‌క్తి. కాంగ్రెసేతర ముఖ్య‌మంత్రిగా మొట్ట‌మొద‌టిసారిగా పాలించ‌బ‌డిన వ్య‌క్తి ఎన్టీఆర్‌. శాస‌న‌మండ‌లి ర‌ద్దు చేసేట‌టువంటి కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

1985 జూన్ 01న శాస‌న మండ‌లి అధికారికంగా ర‌ద్ద‌యింది. హైద‌రాబాద్‌లోని హుస్సెన్‌సాగ‌ర్ న‌ట్ట‌మైన సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్ర‌హాల‌ను నెల‌కొల్పిన కీర్తి ఎన్టీఆర్‌కే ద‌క్కుతుంది. నాదెండ్ల కుట్ర కార‌ణంగా శాస‌న‌స‌భ‌ను త‌న 1985 మార్చిలో ఎన్నిక‌ల‌కు వెళ్లారు ఎన్టీఆర్‌. ఆ ఎన్నిక‌ల్లో 202 స్థానాలు గెలిచి తిరిగి అధికారంలోకి వ‌చ్చారు నంద‌మూరి తార‌క‌రామారావు. 1985 నుంచి 1989కి మ‌ధ్యకాలంలో ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణ‌యాల కారణంగా మ‌ళ్లీ ప్ర‌జాధార‌ణ పోగొట్టుకున్నారు. అది ఏకస్వామ్య పాల‌న అని ప్ర‌జ‌లు నిందించారు. పార్టీలోను, ప్ర‌భుత్వంలోనూ, తన నిర్ణ‌యాలే ఉండ‌డం వ‌ల్ల దెబ్బ ప‌డింది. 1989లో ఎన్నిక‌ల‌కు ముందు మొత్తం మంత్రి వ‌ర్గాన్ని ర‌ద్దు చేసి కొత్త మంత్రి వ‌ర్గాన్ని తీసుకున్నారు ఎన్టీఆర్‌. ఈ స‌మ‌యంలో జ‌రిగిన కొన్ని కుల ఘ‌ర్ష‌ణ‌ను కూడా ఎన్టీఆర్ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీశాయి.

Also Read :  బిజినెస్‌మేన్ సినిమా గురించి మీకు తెలియ‌ని ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇవే..!

1989 ఎన్నిక‌ల్లో ఇవ‌న్నీ కూడా తీవ్ర ప్ర‌భావాన్ని చూపించాయి. కాంగ్రెస్‌, తెలుగుదేశాన్ని ఓడించింది. కాంగ్రెస్ మ‌ళ్లీ అధికారాన్ని త‌న హ‌స్తం గ‌తం చేసుకుంది. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టికీ కూడా అన్నీ రాష్ట్రాల‌లోని ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి కాంగ్రెస్‌కి వ్య‌తిరేకంగా నేష‌న‌ల్ ఫ్రంట్‌ని ఏర్పాటు చేయ‌డంలో ఎన్టీఆర్ విజ‌యం సాధించార‌నే చెప్పాలి. 1991లో నంధ్యాల లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లో అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రి పీ.వీ.న‌ర‌సింహారావు నిల‌బ‌డ‌గా.. ప్ర‌ధాన‌మంత్రికి గౌర‌వ సూచ‌కంగా ఎన్టీఆర్ ఎవ‌రినీ పోటీలో నిల‌బెట్ట‌లేదు. 1984-99 మ‌ధ్య‌కాలంలో ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితానికి గ‌డ్డుకాల‌మ‌నే చెప్పాలి. ప్ర‌తిప‌క్ష నాయ‌కులుగా శాస‌న‌స‌భ‌లో కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల చేతిలో ఎన్నో అవ‌మానాలు పొందారు ఎన్టీఆర్. ఆ స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ స‌భ్యుల‌ను 9సార్లు స‌భ నుంచి బ‌హిష్క‌రించారు. ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ నాలుగు సినిమాల్లో కూడా న‌టించారు. 1993లో ల‌క్ష్మీపార్వ‌తిని ద్వితీయ వివాహం చేసుకున్నారు.  ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ నాలుగు సినిమాల్లో కూడా న‌టించారు. 1993లో ల‌క్ష్మీపార్వ‌తిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లితో కుటుంబ స‌భ్యుల మ‌ధ్య విభేదాలు ఏర్ప‌డ్డాయి. 1994లో రూ.2కే కిలో బియ్యం, పూర్తి మ‌ద్య‌పాన నిషేదం వంటి నినాదాల‌తో ప్ర‌జ‌ల‌కు ముందుకు వ‌చ్చారు. అప్ప‌టి ఎన్నిక‌ల్లో ఎవ్వ‌రూ ఊహించ‌నివిధంగా టీడీపీ ఘ‌న విజ‌యం సాధించింది. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే హామీల‌ను అమ‌లు ప‌రిచారు. ల‌క్ష్మీపార్వ‌తి పార్టీ విష‌యంలో ఎక్కువ‌గా జోక్యం చేసుకోవ‌డంతో పార్టీలో వివాదాలు చోటు చేసుకున్నాయి.

Advertisement

Also Read :  ఎన్టీఆర్‌కి వ్య‌తిరేకంగా కృష్ణ ఇన్ని సినిమాలు తీశాడా..?