Home » ఎన్టీఆర్‌కి వ్య‌తిరేకంగా కృష్ణ ఇన్ని సినిమాలు తీశాడా..?

ఎన్టీఆర్‌కి వ్య‌తిరేకంగా కృష్ణ ఇన్ని సినిమాలు తీశాడా..?

by Anji
Ad

ఒక‌ప్ప‌టి సీనియ‌ర్ హీరోలు అయిన‌టువంటి నంద‌మూరి తార‌క‌రామారావు, సూప‌ర్ స్టార్ కృష్ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రమే లేదు. వీరిద్ద‌రూ క‌లిసి చాలా సినిమాల్లో న‌టించారు. చాలా స్నేహంగా ఉన్నారు. అదేవిధంగా వీరికి చాలా కాలం పాటు దూరంగా కూడా ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌రువాత ఎన్టీఆర్‌, కృష్ణ మ‌ధ్య చాలా వార్ న‌డిచింది. ఎన్టీఆర్‌కి వ్య‌తిరేకంగా కొన్ని సినిమాలు కూడా తీశారు కృష్ణ‌. ప్ర‌ధానంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొత్త‌లో కృష్ణ తీసిన ఈనాడు సినిమా ఎన్టీఆర్ విజ‌యానికి ఎంతో దోహ‌ద‌ప‌డిందనే చెప్పాలి. దేవుడు చేసిన మ‌నుషులు చిత్రం ప్రారంభానికి ముందు జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల కార‌ణంగా వీరిద్ధ‌రి మ‌ధ్య గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మ‌య్యాయి.
srntr

అల్లూరి సీతారామరాజు సినిమాను కృష్ణ ప్రకటించారు. ఈ సినిమాని తానే తీస్తానని ఎన్టీఆర్లు చాలాసార్లు ప్రకటించినప్పటికీ ఎన్టీఆర్ ఈ సినిమాను తీయలేదు. కృష్ణ చేసిన ప్రకటనను చూసి కోపగించుకున్న ఎన్టీఆర్ దేవుడు చేసిన మనుషులు సినిమా 100 రోజుల వేడుకకు హాజరు కాలేదు. తర్వాత ఎన్టీఆర్ తీసిన దానవీరశూరకర్ణ సినిమాకు పోటీగా కృష్ణ కురుక్షేత్రం సినిమాను తీశారు. చిత్ర పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయింది. రెండు చిత్రాలు కూడా 1977లో సంక్రాంతికి పోటా పోటీగా విడుదలయ్యాయి.ఈ సినిమాల తర్వాత అప్పుడప్పుడు వీరిద్దరూ మాట్లాడుకున్నారు.

Advertisement

Advertisement

Also Read :  “మగధీర” సినిమా స్టోరీని రచయిత ఆ సినిమా కథ నుండి తీసుకున్నాడా..? ఆ సినిమా ఏదంటే..?


ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత నాదెండ్ల భాస్క‌ర్ రావు సీఎం అయిన‌ప్పుడు ఆయ‌న‌ను అభినందిస్తూ కృష్ణ ప్రకటనలు చేయడంతో అప్పుడు పెద్ద దుమారమే రేగింది. అభిమానులు ఆగ్రహంతో కృష్ణ సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్ల పై దాడి చేశారు. కృష్ణ పోస్టర్లను తగలబెట్టారు. వెంటనే కృష్ణ మ‌రుస‌టి రోజే నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కానని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా వారికి నా అభినందనలు తెల్పడమే నా అలవాటు అని చెప్పారు. 1984లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సలహా మేరకు కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ త‌రువాత ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉన్న ఎన్టీఆర్ ప్ర‌భుత్వ విధానాల‌ను తూర్పార ప‌డుతూ కృష్ణ కొన్ని సినిమాల‌ను తీశారు. సింహాస‌నం, నా పిలుపే ప్ర‌భంజ‌నం, మండ‌లాధీశుడు, సాహ‌స‌మే నా ఊపిరి, గండిపేట ర‌హ‌స్యం వంటి సినిమాల‌ను తీశారు. అందులో కొన్ని సినిమాల‌కు కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. మ‌రికొన్ని సినిమాల‌కు విజ‌య‌నిర్మ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ విధంగా ప‌లు సినిమాల‌ను కృష్ణ అప్ప‌ట్లో ఎన్టీఆర్‌కి వ్య‌తిరేకంగా తీశారు. ముఖ్యంగా కృష్ణ కాంగ్రెస్‌లో చేర‌డం వ‌ల్ల‌నే ఎన్టీఆర్‌కి బ‌ద్ధ శ‌త్రువు అయ్యార‌ని పలువురు చెబుతుండ‌డం విశేషం.

Also Read :  బిజినెస్‌మేన్ సినిమా గురించి మీకు తెలియ‌ని ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇవే..!

Visitors Are Also Reading