Home » గుర్తుపట్టనంతగా మారిపోయిన చందమామ హీరోయిన్….ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా…!

గుర్తుపట్టనంతగా మారిపోయిన చందమామ హీరోయిన్….ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా…!

by AJAY
Ad

సింధు మీనన్ ఈ పేరు చెప్తే గుర్తు పట్టక పోవచ్చు కానీ చందమామ సినిమాలో కాజల్ సోదరి అంటే మాత్రం టక్కున గుర్తుకు వస్తుంది. చందమామ సినిమాలో కాజల్ కు సోదరిగా సింధు మీనన్ నటించింది. ఈ సినిమాలో హీరోగా నటించిన శివ బాలాజీని ఆటపట్టించే అల్లరి మరదలు క్యారెక్టర్ తో ఆకట్టుకుంది. ఈ సినిమా లో సింధుమీనన్ పాత్రకు ప్రాధాన్యత ఉండటం తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

chandamama-movie-heroine

Advertisement

నిజానికి సింధు మీనన్ చూడ్డానికి తెలుగమ్మాయిలా కనిపించినా మలయాళీ కుటుంబం నుంచి వచ్చింది. చిన్న వయస్సులో భరతనాట్యం నేర్చుకుని అనేక డాన్స్ షోలలో విజేతగా నిలిచింది. ఆ సమయంలో ఓ ప్రోగ్రామ్ జడ్జిగా వ్యవహరిస్తున్న భాస్కర్ దర్శకుడు కే.వి జయరామ్ కు పరిచయం చేశారు. అలా సింధుమీనన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైంది.

Advertisement

Chandamama Heroine Sindhu Menon - Manamnews

Chandamama Heroine Sindhu Menon – Manamnews

చైల్డ్ ఆర్టిస్ట్ గా అభిమానులను సంపాదించుకున్న సింధుమీనన్ ప్రేమ ప్రేమ అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉండగా శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమా తో టాలీవుడ్ హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు, త్రినేత్రం, ఇన్స్పెక్టర్, చందమామ లాంటి సినిమాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

ముఖ్యంగా చందమామ సినిమాలో హీరోయిన్ గా నటించిన సింధు మీనన్ ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే సినిమాలకు దూరం అయిన తర్వాత సింధుమీనన్ కొంతకాలం మలయాళంలో టీవీ సీరియల్స్ మరియు రియాల్టీ షోలలో కనిపించింది. ఆ తర్వాత 2010 లో ఆమె వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది. ప్రస్తుతం వీరికి ఒక పాప బాబు ఉన్నారు. సింధు మీనన్ ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also read :

అలాంటి వీడియోలు చేస్తున్నాడు అంటూ యూట్యూబర్ పై కరాటే కల్యాణి దాడి…వీడియో వైరల్…!

“రాజన్న” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే…!

Visitors Are Also Reading