విక్రమ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నాగార్జున ఆ తరవాత ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. అక్కినేని వారసుడుగా ఎంట్రీనప్పటికీ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. ఎక్కువగా ప్రేమకథా చిత్రాలలో నటించి నాగార్జున మన్మథుడుగా పేరు సంపాదించుకున్నాడు. అయితే కేవలం ప్రేమకథా చిత్రాలు మాస్ సినిమాలే కాకుండా భక్తిరస సినిమాలలోనూ నటించి సూపర్ హిట్ లు అందుకున్నాడు.
Advertisement
ముఖ్యంగా నాగార్జున అన్నమయ్య సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో దగ్గరయ్యాడు. ఈ సినిమాలో నాగార్జున వెంకటేశ్వరుడి భక్తుడి పాత్రలో అన్నమయ్యగా కనిపించాడు. ఈ పాత్రలో నాగార్జన నటకు అందరూ షాక్ అయ్యారు. ఇక ఈ సినిమాలో స్వామి వారి పాత్రలో సుమన్ నటించిన సంగతి తెలిసిందే. అయితే నిజానికి ఈ సినిమాలో వెంకటేశ్వరుడి పాత్ర కోసం మొదట సుమన్ ను అనుకోలేదట.
ALSO READ : విజయశాంతి కోసం బాలకృష్ణ అంతటి త్యాగం చేశారా…?
Advertisement
ఈ సినిమాలో చాలా సీన్ లలో స్వామివారి పాదాల పై అన్నయ్య పడిపోయి మొక్కాల్సి ఉంటుంది. దాంతో మొదట ఈ సినిమాలో సీనియర్ హీరోను స్వామి వారి పాత్ర కోసం తీసుకోవాలని చిత్రయూనిట్ నిర్నయించుకుందట. దాంతో మొదటగా శోభన్ బాబును ఈ పాత్రకోసం అడిగారట. కానీ ఆయన కాదని చెప్పలేక రూ.50 లక్షల రెమ్యునరేషన్ ను డిమాండ్ చేశాడట.
దాంతో చిత్రయూనిట్ నటసింహం నందమూరి బాలకృష్ణను ఈ సినిమా కోసం సంప్రదించిందట. కానీ స్టార్ హీరో అలాంటి పాత్రలో కనిపిస్తే అభిమానులు ఎలా స్వీకరిస్తారో అని రాఘవేంద్రరావు వెనక్కితగ్గారట. ఆ తరవాత సుమన్ అయితే దేవుడి పాత్రలో బాగుంటుందని అనిపించడంతో ఆయనను సంప్రదించారట. సుమన్ గ్రీన్ సిగ్నల్ అవ్వడంతో సినిమాలో ఫిక్స్ చేశారు. ఇక సుమన్ కూడా తన పాత్రకు 100శాతం న్యాయం చేసిన సంగతి తెలిసిందే.
Advertisement
ALSO READ : ఆస్కార్ అవార్డు వచ్చింది ఎన్టీఆర్, చరణ్ లకు కాదు.. చంద్రబోస్ ఏమన్నారంటే..?