Telugu News » Blog » విజయశాంతి కోసం బాలకృష్ణ అంతటి త్యాగం చేశారా…?

విజయశాంతి కోసం బాలకృష్ణ అంతటి త్యాగం చేశారా…?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబ హీరోగా బాలకృష్ణ ఎంతటి ఘనత సాధించారో మన అందరికీ తెలుసు. అంతేకాదు టాలీవుడ్ లో లేడీ అమితాబ్ గా విజయశాంతి కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ ఇద్దరు నటులు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో నటించి లక్షలాది మంది అభిమానుల గుండెలను దోచుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ము*ల కృష్ణయ్య, కథానాయకుడు, భలే దొంగ, అపూర్వ సహోదరులు అనే సినిమాలు కూడా వచ్చి అప్పట్లో సూపర్ హిట్ అందుకున్నాయి.

Advertisement

also read:ఆ వాసన ఆ హీరోయిన్ నుంచి మాత్రమే వచ్చేదట.. కారణమేంటంటే..?

అంతేకాకుండా బాలయ్యతో నిప్పురవ్వ మూవీని కూడా విజయశాంతి నిర్మించి హీరోయిన్ గా చేసింది. బాలయ్య విజయశాంతి హీరో హీరోయిన్స్ గా బి. గోపాల్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ మూవీ సంచలన విజయనందుకుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య నటన డైలాగులు అందరినీ ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. ఇందులో విజయశాంతి రోల్ చాలా బాగుంటుంది. ఒకచోట ఫైట్ కూడా చేస్తుంది.

Advertisement

also read:విరాట్ కోహ్లీకి తీవ్ర అనారోగ్యం… అనుష్క ఎమోషనల్..!

అయితే సినిమా ఎడిటింగ్ టైంలో లెంత్ ఎక్కువ కావడంతో విజయశాంతి ఫైటింగ్ సీన్ తీసేయాలని దర్శకుడు బి.గోపాల్ భావించారు. ఇదే విషయాన్ని బాలయ్యతో చెప్పడంతో ఆ అమ్మాయి కష్టపడి చేసిన ఫైట్ సీన్ తీసేస్తే ఎలా.. కావాలంటే నా ఫైటింగ్ సీన్ ఒకటి తీసేయండని బాలయ్య అనడంతో అందరూ ఆశ్చర్య పోయారట. అలా విజయశాంతి ఫైట్ సీన్ ఉంచి, బాలయ్య ఫైట్ సీన్ తీసేయడంతో విజయశాంతి కోసం బాలయ్య త్యాగం చేశారని అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి.

Advertisement

also read: