Home » 75 Weds 35.. లేట్ వయస్సులో లెటెస్ట్ పెళ్లి..!

75 Weds 35.. లేట్ వయస్సులో లెటెస్ట్ పెళ్లి..!

by Anji
Ad

పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు మన పెద్దలు. మామూలుగా ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అని అంటుంటారు. కానీ ఇప్పుడు పెళ్లికి కూడా వయసుతో సంబంధం లేదని నిరూపించారు. తాజాగా 75 ఏళ్ల తాత, 35 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకొని ఓ ట్రెండ్ సృష్టిస్తున్నాడు సోషల్ మీడియాలో. 75 ఏళ్ల వయస్సులో 35 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్న తాతయ్య గురించి ఇప్పుడు మనం తప్పక తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఈ తాతయ్య పెళ్లి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వాళ్ల ఫొటో షూట్ ఫొటోలు తెగ షేర్ అవుతున్నాయి. దీంతో ఆయన ఎవ్వరూ ఏంటి అనేది తెలుసుకోవాలని చాలా మంది గూగుల్ లో సెర్చ్ చేయడంతో ఆ కపుల్ ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మరీ ఎవరు ఈ కపుల్.. ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే విషయాలను తెలుసుకుందాం. 

Advertisement

Advertisement

 

ఈ ఫొటోలో పెళ్లి కొడుకు గెటప్ లో కనిపిస్తున్న వ్యక్తి పేరు వీరన్న, అమ్మాయి పేరు అనుశ్రీ. వీరిద్దరూ లేటెస్ట్ గా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఫొటో షూట్ చేసుకోవడంతో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. కర్ణాటకలో చిక్ బళ్లారి జిల్లా కు చెందిన వీరన్న పేరున్న వ్యక్తే. గతంలో పెళ్లి జరిగింది. పిల్లలు కూడా ఉన్నారు. ఐదేళ్ల కిందట వీరన్న భార్య అనారోగ్యంతో మరణించింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు వీరన్న. పిల్లలు పట్టించుకోవడం మానేశారు. ఒంటరిగా ఉన్న వీరన్న పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అలా తనకు పరిచయం ఉన్న అనుశ్రీ అనే 35 ఏళ్ల మహిళకు ఈయన పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. ఆమె కూడా ఒప్పుకుంది.

వెంటనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అను శ్రీకి కూడా గతంలో పెళ్లి జరిగి ఇద్దరూ పిల్లలున్నారు. ప్రస్తుతం ఆమె భర్తను వదిలేసి ఒంటరిగానే ఉంది. వీరన్న ఆమెతో పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. ఆవిడ అంగీకరించింది. దీంతో స్వగ్రామంలో నిరాడంబరంగా వీరిద్దరి పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించి వీడియోలు, ఫొటోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. మనవళ్లతో కాలక్షేపం చేస్తూ..కృష్ణ, రామా అంటూ తాతయ్య రెండో పెళ్లి చేసుకోవడమేంటయ్యా అంటున్నారు. కొంతమంది అయితే మాకు ఒక్క పెళ్లి దిక్కులేదయ్యా.. నీకు ఈ వయసులో పిల్ల భలేదొరికిందయ్యా అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఈ పెళ్లి చూసి మీకు ఏం అనిపిస్తుంది.   

Visitors Are Also Reading