Home » 11 ఏళ్ల బాలికతో 40 ఏళ్ల వ్యక్తి పెళ్లి.. స్టోరీ చూస్తే కన్నీరు ఆగదు..!!

11 ఏళ్ల బాలికతో 40 ఏళ్ల వ్యక్తి పెళ్లి.. స్టోరీ చూస్తే కన్నీరు ఆగదు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఆ బాలికకు 11 సంవత్సరాలు.. అతగాడికి 40 సంవత్సరాలు.. అంటే ఇంచుమించు మనవరాలు వయస్సు.. అయినా ఆమెను పెళ్లి చేసుకున్నాడు.. కారణం ఆ బాలిక తల్లిదండ్రుల కటిక పేదరికం.. పెళ్లయింది.. ఇక మొదటి రాత్రి కూడా అయిపోయింది.. ఆ వ్యక్తి ఆ రాత్రి బాలిక క*త్వాన్ని చూసి గర్వంతో విర్రవీగుతున్నాడు.. కానీ ఆవిడ మాత్రం ఆ చీకటి రాత్రి ఎంతో బాధను, భరించలేని నొప్పిని తన పంటి కింద బిగుతుగా పట్టుకొని భరించింది.. అలా మూడు నెలల వరకు ప్రతిరోజు నరకరాత్రే.. త్రీ మంత్స్ గడిచిన తర్వాత ఇక టార్చర్ మొదలైంది.. ఇంత సమయం గడిచినా గర్భం రాలేదని అత్తింటి వారు సూటిపోటి మాటలు. చివరికి కొట్టడం కూడా మొదలుపెట్టారు. ఇక ఫైనల్ గా నువ్వు వద్దంటూ తన పుట్టింటికి పంపారు భర్త, అత్త మామ. అలా పుట్టింటికి వచ్చి నాలుగు నెలలు కూడా గడవలేదు.

Advertisement

మళ్లీ నాన్న అప్పుచేసి మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ వ్యక్తికి అప్పటికే విడాకులు అయ్యాయి. దానికి కారణం తన మొదటి భార్య కూతురికి జన్మనిచ్చిందని..! అలాంటి వ్యక్తికి మళ్లీ నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు నాన్న.. అంతా బాగానే ఉంది. కానీ నీ మొదటి భర్త నీతో ఏ విధంగా ఉండేవాడు అంటూ.. నా మానిన గాయాన్ని మరి మరీ గుర్తు చేసేవాడు. ఇతగాడిది కూడా ఇంచుమించు మొదటి వ్యక్తి లాంటి క్యారెక్టరే. కానీ ఇప్పటికీ నాకు కాస్త వయసు పెరగడంతో వీడి దాహానికి తట్టుకోగలుగుతున్నాను.. అలా కొన్ని సంవత్సరాలు గడిచింది.. నాకు పండంటి ఆడపిల్ల పుట్టింది.. కానీ తన భర్త చూడడానికి రాలేదు. తనకు విడాకులు ఇస్తున్నానని ఆయన చెల్లితో కబురు పంపాడు..

Advertisement

also read:hijr*s నుంచి ఈ వస్తువు తీసుకుంటే చాలా అదృష్టం.. ఏంటది..?

మొత్తానికి తప్పంతా నేను పేదరికంలో పుట్టడం.. ఎందుకంటే ముందు చేసుకున్న భార్యకు ఆడపిల్ల పుట్టిందని విడాకులు ఇచ్చాడు.. అలాగే నాకు కూడా ఆడపిల్ల పుట్టిందని విడాకులు ఇస్తానని కబురు పంపాడు. తప్పు మా నాన్న గారిదే.. ఇక చివరికి ఓ నిర్ణయం తీసుకున్నా.. నాకు ఇక భర్త వద్దు ఏమి వద్దు.. నాకు చేతనైన పని చేసుకుని నా పాపను పోషించుకుంటాను.. నా కూతురిని భర్త మీద ఆధారపడి బ్రతికే అమ్మాయిలా పెంచవద్దు అనుకుంటున్నాను.. బాగా చదివించి, తన కాళ్లపై తానే నిలబడేలా, అమ్మాయిలా పుట్టడం శాపం కాదు వరం అనుకునేలా చేస్తాను.. ప్రస్తుతం నాకున్న ఆలోచన అంతా ఇదే.. ఎర్రటి ఎండలో నవ్వుతూ కూలి పని చేసుకుంటున్న మహిళ కథ ఇది..మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.

also read:

Visitors Are Also Reading