Home » ఎసిడిటీతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం పొందవచ్చు..!

ఎసిడిటీతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం పొందవచ్చు..!

by Anji
Ad

ప్రస్తుతం మారుతున్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఎసిడిటీతో బాధ పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడంలో శరీరంలో ఉత్పత్తి అయ్యే యాసిడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే మోతాదుకి మించి యాసిడ్ ఉత్పత్తి అయితే అసిడిటీ సమస్య వస్తుంది. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడంతో పాటు.. కడుపులో మంట, నొప్పి, వాంతులు వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. ఇలాంటి వారిలో నిత్యం పుల్లటి తేన్పులతో పాటు కడుపులో మంటగా ఉంటుంది. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించి మందులను వాడుతుంటారు. అయితే అసిడిటీని కొన్ని న్యాచురల్‌ పద్ధతుల్లో కూడా తగ్గించుకోవచ్చు. ఇంతకీ ఇన్‌స్టాంట్‌గా అసిడిటీ లక్షణాలను తగ్గించుకోవాలంటే ఎలాంటి విధానాలు పాటించాలో ఇప్పుడు  మనం తెలుసుకుందాం. 

Advertisement

Advertisement

  • ఎసిడిటీ కారణంగా కడుపు మంటగా ఉంటే పాలను తాగడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. అయితే పాలను ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లటి పాలను తాగితే మరింత మెరుగైన ప్రయోజనం పొందొచ్చు. దీంతో ఎసిడిటీ నుంచి వెంటనే ఉపశమనం పొందొచ్చు. పాలలోని కాల్షియం కడుపులో ఆమ్లం ఉత్పత్తిని నిరోధిస్తుంది. దీంతో కడుపులో మంట, నొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. కాబట్టి కడుపులో మంటగా ఉంటే వెంటనే చల్లటి పాలను తాగాలి.
  • ఎసిడిటీకి చెక్‌ పెట్టడంలో సెలెరీ కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ వెజిటేబుల్‌తో అసిడిటీ నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇందులోని క్రియాశీల ఎంజైమ్‌లు, రసాయనాలు కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. ఇది కడుపులో యాసిడ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఆకుకూరల వినియోగం యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

  •  ఎసిడిటీ కారణంగా కడుపు మంటగా ఉంటే పాలను తాగడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. అయితే పాలను ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లటి పాలను తాగితే మరింత మెరుగైన ప్రయోజనం పొందొచ్చు. దీంతో అసిడిటీ నుంచి వెంటనే ఉపశమనం పొందొచ్చు. పాలలోని కాల్షియం కడుపులో ఆమ్లం ఉత్పత్తిని నిరోధిస్తుంది. దీంతో కడుపులో మంట, నొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. కాబట్టి కడుపులో మంటగా ఉంటే వెంటనే చల్లటి పాలను తాగాలి.
  • ఎసిడిటీకి చెక్‌ పెట్టడంలో సెలెరీ కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ వెజిటేబుల్‌తో అసిడిటీ నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇందులోని క్రియాశీల ఎంజైమ్‌లు, రసాయనాలు కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. ఇది కడుపులో యాసిడ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఆకుకూరల వినియోగం యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Visitors Are Also Reading