ఈరోజుల్లో చాలా మంది జుట్టు తెల్లగా వచ్చేస్తోంది. వయసు తక్కువైనా కూడా జుట్టు తెల్లగా మారిపోతుంది. మీ జుట్టు కూడా తెల్లగా వచ్చేసిందా..? అయితే కచ్చితంగా ఇలా చేయండి తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి ఈరోజు ఒక ఇంటి చిట్కాని మేము తీసుకువచ్చాము ఇలా ఈజీగా మీరు తెల్ల జుట్టుని నల్లగా మార్చేసుకోవచ్చు. ఈ చిట్కా కోసం మీరు ఎటువంటి పదార్థాలని కొనక్కర్లేదు. అన్ని ఇంట్లో ఉండేవే. తెల్ల జుట్టు ని ఇలా ఈజీగా మీరు నల్లగా మార్చేసుకోవచ్చు.
Advertisement
Advertisement
ఒక గిన్నె పెట్టి అందులో ఒక అరకప్పు నీళ్లు పోసుకోవాలి. అందులో టీ పొడి వేసి మరిగించాలి డికాషన్ ని తీసుకుని వడకట్టుకోవాలి. ఒక ఐరన్ ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్ల వరకు ఉసిరి పొడిని వేసుకోవాలి. తర్వాత బృంగరాజ్ పౌడర్ ని కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి. ఇందులో ఇండిగో పౌడర్ని రెండు స్పూన్లు వేయాలి. రెండు నిమిషాల పాటు వేయించి కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఒక గంట పక్కన పెట్టేస్తే నల్ల రంగులోకి ఇది మారుతుంది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు డికాషన్ వేసి కలిపి తలకి పట్టించాలి గంట వరకు వదిలేసి ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.
Also read:
- చాణక్య నీతి: విద్యార్థులు పరీక్షల్లో సక్సెస్ అవ్వాలంటే… వీటిని మరచిపోకూడదు..!
- పెళ్లి చూపుల్లో అబ్బాయిని.. ఈ 3 ప్రశ్నలు అమ్మాయి అడిగి తీరాలి..!
- ఇంట్లో బల్లులు ఎక్కువయ్యాయా..? ఇలా ఈజీగా తరిమేయండి మరి..!