Home » చాణక్య నీతి: విద్యార్థులు పరీక్షల్లో సక్సెస్ అవ్వాలంటే… వీటిని మరచిపోకూడదు..!

చాణక్య నీతి: విద్యార్థులు పరీక్షల్లో సక్సెస్ అవ్వాలంటే… వీటిని మరచిపోకూడదు..!

by Sravya
Ad

ఆచార్య చాణక్య చెప్పినట్లు చేయడం వలన కచ్చితంగా లైఫ్ లో సక్సెస్ ఉంటుంది. చాణక్య ప్రతి ఒక్కరి గురించి ఎంతో చక్కగా వివరించారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం అంతా బాగుంటుంది. చాణక్య విద్యార్థులకు కూడా కొన్ని సూత్రాలు చెప్పారు. విద్యార్థులు మంచి మార్కులు రావాలంటే ఏం చేయాలి అనేది చాణక్య వివరించారు. విద్యార్థులు సోమరితనాన్ని విడిచిపెట్టాలి. సోమరితనం ఉన్న విద్యార్థులు అసలు రాణించలేరు. పైగా సోమరితనం వాళ్ళకి పెద్ద శత్రువు అవుతుంది. లక్ష్యం కోసం పనిచేయడం మొదలు పెట్టేటప్పుడు సోమరితనాన్ని పక్కన పెట్టేసి లక్ష్యం కోసం ప్రయత్నం చేయాలి.

Advertisement

Advertisement

అలానే పనులు వాయిదా వేయకూడదు. ఏం చేసినా రేపు కాదు ఈరోజే అని అనుకుంటూ ఉండాలి అలా చేస్తే వెంటనే మీరు మీ పనుల్ని పూర్తి చేసుకుంటూ ఉంటారు. వాయిదా వేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. చెడు అలవాట్లకి విద్యార్థులు అస్సలు ఆకర్షితులు అవ్వకూడదు. చెడు అలవాట్లు ఆరోగ్యానికి హానికరం. పైగా భవిష్యత్తును కూడా పాడు చేస్తాయి అత్యాశ కూడా విద్యార్థులకి ఉండకూడదు. దురాశ మానవునికి అత్యంత నీచమైన లక్షణం అని తెలుసుకోండి. చదువుతో పాటుగా వినోదం కూడా ముఖ్యమే. ఇలా చాణక్య చెప్పినట్లు మీరు పాటించినట్లయితే కచ్చితంగా విద్యార్థులకు విజయాన్ని అందుకుంటారు.

Also read:

Visitors Are Also Reading