కొంతమంది సెలబ్రిటీలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకొని గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో పేరును సంపాదించుకుంటారు. సాధారణ వ్యక్తులు కూడా గొప్ప గొప్ప పనులు చేసి, విచిత్రమైన సాహసాలు చేసి ఇందులో చోటును సంపాదించుకుంటారు. మరి మన సెలబ్రిటీలు ఎవరెవరు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో పేరును సంపాదించుకున్నారో ఇప్పుడు చూద్దాం…
Advertisement
# బ్రహ్మానందం
మన హాస్యనటుడు బ్రహ్మానందం 1000 పైగా సినిమాల్లో నటించినందుకు గాను 2010 గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో పేరును సంపాదించుకున్నారు.
# సుశీల
గాన కోకిలగా పేరును సంపాదించుకున్న సుశీల గారు ఏకంగా 18 వేలకు పైగా పాటలను పాడి ఇందులో చోటును సంపాదించుకున్నారు.
Advertisement
# ఎస్పీ బాలసుబ్రమణ్యం
ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు 40 వేలకు పైగా పాటలను పాడి 2001లో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో చోటును సంపాదించుకున్నారు.
# విజయనిర్మల విజయనిర్మల గారు అప్పట్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 42 సినిమాలను డైరెక్ట్ చేసిన మహిళగా విజయనిర్మల గారు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో పేరును సంపాదించుకున్నారు.
# డి రామానాయుడు
రామానాయుడు గారు 13 భాషలలో 150కి పైగా చిత్రాలను అందించిన నిర్మాతగా 2008లో చోటును సంపాదించుకున్నారు.
ఇవి కూడా చదవండి
CSK : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ !
India Squad of World Cup 2023 : సంజూ, ధావన్‌కు చోటు.. సూర్య ఔట్ ?
అంతా తొండాటే…. పేరుకే పాకిస్తాన్ యువ జట్టు… అందరూ అంకుల్సే ?