Home » CSK : చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ గా రుతురాజ్ గైక్వాడ్ !

CSK : చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ గా రుతురాజ్ గైక్వాడ్ !

by Bunty
Ad

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్, టీమిండియా బ్యాట్స్మెన్ రుతురాజు గైక్వాడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఐపీఎల్ 2023 టోర్నమెంటులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రుతురాజు గైక్వాడ్… ఆ జట్టుకు టోర్నమెంట్ తేవడంలో తన వంతు పాత్రను చాలా సక్సెస్ ఫుల్ గా నెరవేర్చాడు. జట్టులోనే టాప్ స్కోరర్ గా నిలిచి అద్భుతం సృష్టించాడు రుతురాజు గైక్వాడ్.

Advertisement

అయితే ధోని రిటైర్మెంట్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు అందరికీ ఎదురవుతోంది. 2024 టోర్నమెంట్ తర్వాత మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో నెక్స్ట్ కెప్టెన్ రుతురాజు గైక్వాడ్ అని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ అంబటి రాయుడు అన్నారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఉన్న అనుభవాలను మీడియాకు పంచుకున్నారు అంబటి రాయుడు. ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చాలా అద్భుతమైనదని వెల్లడించారు.

Advertisement

ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఋతురాజు గైక్వాడ్ అయితే చాలా బాగుంటుందని.. అతడైతేనే చాలా కరెక్ట్ అంటూ అంబటి రాయుడు తెలిపారు. యంగ్ ప్లేయర్ కనుక… టి20 రుతురాజు గైక్వాడ్ సరిపోతాడని అంబటి రాయుడు తన అభిప్రాయం తెలిపారు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ప్లేయర్లు అందరూ చాలా క్లోజ్ గా ఉంటారని… ధోని మరియు జడేజా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. జడేజాను చెక్కి చెక్కి.. ఇక్కడిదాకా తీసుకువచ్చింది ధోనినే అని వెల్లడించారు అంబటి రాయుడు. కాగా ఆసియా క్రీడల్లో భాగంగా… చైనాకు వెళ్లే టీమిండియా జట్టు కెప్టెన్గా రుద్రాజ్ గైక్వాడ నియామకమైన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

India Squad of World Cup 2023 : సంజూ, ధావన్‌కు చోటు.. సూర్య ఔట్ ?

అంతా తొండాటే…. పేరుకే పాకిస్తాన్ యువ జట్టు… అందరూ అంకుల్సే ?

7G బృందావన కాలనీ.. హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

Visitors Are Also Reading