Home » India Squad of World Cup 2023 : సంజూ, ధావన్‌కు చోటు.. సూర్య ఔట్ ?

India Squad of World Cup 2023 : సంజూ, ధావన్‌కు చోటు.. సూర్య ఔట్ ?

by Bunty
Ad

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ కు రోజులు దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఇక అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ దేశాల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఇప్పటికే అహ్మదాబాద్ లో ఉన్న హోటల్స్ అన్ని బుక్ అయిపోయాయి. అటు ఆసుపత్రుల బెడ్లు కూడా బుక్ చేసుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

Advertisement

ఇక ఇలాంటి నేపథ్యంలో వన్డే వరల్డ్ కప్ 2023 కోసం ఆడే టీమిండియా జట్టు లో ఏ ప్లేయర్లు ఉంటారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇలాంటి తరుణంలో… ప్రపంచ కప్ 2023 బరిలోకి దిగే జట్టును మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అంచనా వేశారు. ఒకవేళ తానే కోచ్ అయితే ఇలాంటి జట్టును ప్రకటిస్తానంటూ తెలిపాడు వసీం జఫర్. వసీం జాఫర్ అంచనా ప్రకారం శిఖర్ ధావన్ కు టీమిండియాలో చోటు దక్కనుంది.

Advertisement

అలాగే కేఏల్ రాహుల్ ను వికెట్ కీపర్ గా తీసుకోవాలని… అతనికి బ్యాకప్ కీపర్ గా సంజు ను తీసుకుంటే మంచిదని తెలిపాడు. ఇక బ్యాకప్ ఓపెనర్ గా శుభ మన్ గిల్ కు అవకాశం కల్పించాడు వసీం జాఫర్. కుల్దీప్ యాదవ్, అక్షర పటేల్, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా లాంటివారికి అవకాశం కల్పించిన వసీం జాఫర్… సూర్య కుమార్ యాదవ్ మరియు ఇషాన్ కిషన్ , చాహల్ ను పక్కన పెట్టేశాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే… మహమ్మద్ సిరాజ్ తో పాటు షమీ, శార్దూల్ ఠాకూర్, బమ్రలకు చాన్స్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

అంతా తొండాటే…. పేరుకే పాకిస్తాన్ యువ జట్టు… అందరూ అంకుల్సే ?

7G బృందావన కాలనీ.. హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

గ్రాండ్ గా SRH కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ పెళ్లి…ఫోటోలు వైరల్

Visitors Are Also Reading