Home » ఇంట్లో డబ్బులు అస్సలు ఉండటంలేదా? బీరువా ఆ దిశలో పెట్టండి.. ఆపై లక్ష్మీకటాక్షం !

ఇంట్లో డబ్బులు అస్సలు ఉండటంలేదా? బీరువా ఆ దిశలో పెట్టండి.. ఆపై లక్ష్మీకటాక్షం !

by Bunty
Ad

ఇంట్లో ప్రతిఒక్కరూ వాస్తుని తప్పకుండా పాటించాలి. ప్రతి ఇంట్లో వాస్తు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాస్తు ప్రకారం చేయడం వల్ల అంతా శుభాలే జరుగుతాయి. సమస్యలన్నీ తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చు. వాస్తుప్రకారం ఇంట్లో సామాన్లను పెట్టుకోవడం వల్ల అంతా మంచే జరుగుతుంది.

Advertisement

ముఖ్యంగా వాస్తు ప్రకారం ఇంట్లో బీరువా ఏ దిశలో ఉండాలి అనేది కచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాలి. ఎప్పుడూ కూడా ఇంట్లో బీరువాని పెట్టేటప్పుడు తప్పు దిక్కులో పెట్టకూడదు. అలా చేయడం వల్ల అంతా చెడు జరుగుతుంది. లేనిపోని సమస్యలు కలుగుతాయి. ఇంట్లో బీరువాని ఉత్తర వాయువ్యంలో ఉంచడం మంచిది. ఎందుకంటే వాయువ్యం చంద్రునిది. ఆయన ధనానికి అధిపతి. కాబట్టి మనం బీరువాలో డబ్బు, నగలు వంటివి పెడతాం కాబట్టి ఉత్తర వాయువ్యంలో ఉంచడం మంచిది. బీరువాని నైరుతి వైపు అసలు పెట్టకూడదు. అలా పెడితే కేవలం బట్టల్ని మాత్రమే పెట్టాలి. బంగారం, డబ్బు వంటివి పెట్టకూడదు. దక్షిణ దిక్కులో బీరువాని పెట్టడం అంటే తెరిచినప్పుడు ఉత్తరం వైపు ఉండాలి.

Advertisement

ఒకవేళ కుదరకపోతే ఉత్తర దిక్కుకి బుధుడు అధిపతి. బుధుడు సంపాదనకు అధిపతి కాబట్టి ఉత్తర దిక్కు మధ్య భాగంలో కూడా పెట్టవచ్చు. దక్షిణ ముఖాన్ని బీరువా చూస్తూ ఉండాలి. నైరుతివైపు అస్సలు పెట్టకూడదు. అలా చేస్తే ఎంత డబ్బు వచ్చినా కూడా సరిపోదు. వచ్చినట్టే వచ్చి అంతా పోతుంది. ఉత్తర వాయువ్యంలో కనుక బీరువాని పెట్టి ధనం, నగలు ఉంచితే డబ్బు ఖర్చు అవ్వదు. దానివల్ల అభివృద్ధి చెందవచ్చు. కనుక ఇంట్లో బీరువాని పెట్టేటప్పుడు ఈ దిశలో ఉండేటట్టు పెట్టుకోవాలి. అప్పుడు ఎలాంటి ఆర్థిక బాధలు ఉండవు.

ఇవి కూడా చదవండి

భార్య, భర్తతో పొరపాటున కూడా ఇలాంటి విషయాలు అస్సలు చెప్పకూడదు….!

Sangeetha: పెళ్లి త‌ర్వాత న‌ర‌కం చూశా.. భ‌ర్తను వదిలేద్దామనుకున్నా..!

భార్యకు భర్త.. టైం ఇవ్వకపోతే..భార్య ఇలాంటి పనులే చేస్తుంది !

Visitors Are Also Reading