Home » Sangeetha: పెళ్లి త‌ర్వాత న‌ర‌కం చూశా.. భ‌ర్తను వదిలేద్దామనుకున్నా..!

Sangeetha: పెళ్లి త‌ర్వాత న‌ర‌కం చూశా.. భ‌ర్తను వదిలేద్దామనుకున్నా..!

by Bunty
Ad

ఒకప్పటి స్టార్ హీరోయిన్ సంగీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో అద్భుతంగా నటించి మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ నటి ప్రస్తుతం అవకాశాలను అందుకోలేక పోతుంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాతో మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ వరుస సినిమాలను చేస్తూ బిజీగా మారిపోయింది ఈ అమ్మడు.

Advertisement

ప్రస్తుతం సహాయక పాత్రలలో నటిస్తుంది. ఇక సంగీత వ్యక్తిగత విషయానికి వస్తే… 2009లో కోలీవుడ్ సింగర్ అయినటువంటి క్రిష్ ను వివాహం చేసుకుంది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. వీరికి ఒక పాప కూడా జన్మించింది. ఇక వివాహం జరిగిన కొన్ని రోజులకి తాను తన భర్తకు విడాకులు తీసుకుందామని అనుకున్నామని తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించింది సంగీత. మా ఇద్దరిదీ ప్రేమ వివాహం. ఇరు కుటుంబ సభ్యుల నుంచి వివాహ అనంతరం ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాము. దీంతో ఎందుకు పెళ్లి చేసుకున్నామా అని అనిపించింది.

Advertisement

మా ఇద్దరిదీ ప్రేమ వివాహమైనప్పటికీ ఇద్దరి ఆలోచనలు చాలా వేరుగా ఉండేవి. అభిరుచులు కూడా వేరుగా ఉండేది. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు. దాంతో ఇద్దరి మధ్య చాలా మనస్పర్ధలు వచ్చి గొడవలు జరిగాయి. ఇక కొన్ని రోజులకి మేము ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభించాం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. మేమిద్దరం విడిపోవాలి అనుకున్న సమయంలో క్రిష్ చాలా సపోర్ట్ గా మాట్లాడేవాడు. జీవితం అనుకున్నట్టుగా ఉండదు. మనం కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అని నన్ను మోటివేట్ చేసేవాడు. క్రిష్ చాలా అద్భుతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి నాకు దొరకడం నా అదృష్టం అని సంగీత చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

భార్యకు భర్త.. టైం ఇవ్వకపోతే..భార్య ఇలాంటి పనులే చేస్తుంది !

Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?

దవడ పగిలినా బౌలింగ్‌ చేసి….చరిత్ర సృష్టించిన అనిల్ కుంబ్లే

Visitors Are Also Reading