టాలెంట్ ఉండాలే కానీ ఏదైనా సాధించగలమని కొంతమందిని చూస్తే అర్థమవుతుంది. అలా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే నటన టాలెంట్ ఉంటే సరిపోతుంది. ఎలాగైనా రాణించవచ్చు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో ముందుగా గుర్తుకు వచ్చేది చిరంజీవి, ఈయన తర్వాత రవితేజ మాత్రమే.. అలా రవితేజ కనీసం సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగారు.
Advertisement
అలాంటి ఆయన ముందుగా డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి, ఆ తర్వాత చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. అలాంటి రవితేజ మహేష్ బాబు కాంబినేషన్లో రావాల్సిన ఒక సినిమా మిస్ అయిందట. అదేంటో చూద్దాం.. సూపర్ స్టార్ కృష్ణ నటవరసత్వాన్ని అందుకొని ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగారు మహేష్ బాబు. ఆయన మొదటి చిత్రం రాజకుమారుడు.
Advertisement
అయితే ఇందులో రవితేజకు ఒక క్యారెక్టర్ లో నటించే అవకాశం వచ్చిందట. కానీ అప్పటికే రవితేజ చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడంతో డేట్స్ కుదరలేదు, దింతో ఆయన ఆ సినిమాలో చేయలేదట. అలా వీరిద్దరి కాంబోలో రావలసిన సినిమా మిస్ అయింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాలో పాత్ర చేసి అందరినీ మెప్పించారు రవితేజ. ఆయన స్టార్ హీరో అయ్యాక మరో హీరో పక్కన నటించిన మొదటి సినిమా ఇదే. కానీ భవిష్యత్తులో ఆయన మహేష్ బాబు రవితేజ కలిపి సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నాను.
మరికొన్ని ముఖ్య వార్తలు :
- ఈ 8రకాల ఫుడ్స్ తిన్నారంటే.. కంటికి ఎంతో మేలు..!!
- ధోనీ బౌలింగ్.. కోహ్లీ కీపింగ్ చేశారనే విషయం మీకు తెలుసా ?
- బ్రహ్మానందం కి కాబోయే కోడలు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?