Home » ధోనీ బౌలింగ్.. కోహ్లీ కీపింగ్ చేశారనే విషయం మీకు తెలుసా ?

ధోనీ బౌలింగ్.. కోహ్లీ కీపింగ్ చేశారనే విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఎవ్వరం అస్సలు ఊహించలేము. ముఖ్యంగా ఎప్పుడు వికెట్ పడుతుందో.. ఎప్పుడు సిక్స్, ఫోర్ కొడతారో.. ఎప్పుడు ఎవ్వరూ ఆడుతారో.. ఎప్పుడు ఎవ్వరూ ఆడరో ఊహించడం చాలా కష్టం అనే చెప్పవచ్చు. ఇలాంటి కోవలోనే టీమిండియా మాజీ సారథులు, స్టార్ ప్లేయర్స్ ఎం.ఎస్. ధోనీ, విరాట్ కోహ్లీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వీరు తమ అద్భుతమైన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ధోనీ నేతృత్వంలో ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ కప్ గెలవడంతో అభిమానులు సంబురాలు జరుపుకున్నారు. విరాట్ కోహ్లీ అభిమానులను ఎప్పుడు సంబురపరుస్తూనే ఉంటారు.

Advertisement

వీరిద్దరూ ఇండయన్ క్రికెట్ హిస్టరీలోనే ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. వీరు మైదానంలో ఉంటే ప్రత్యర్థికి చెమటలు పట్టడం ఖాయం. వీరు క్రీజులోకి ఎంట్రీ ఇస్తే.. కొండంత లక్ష్యం అయినా కరగిపోవాల్సిందే. ఛేజింగ్ మాస్టర్ గా విరాట్ కోహ్లీ.. మ్యాచ్ ఫినిషర్ గా ధోనీ భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించారు. 2011లో ప్రపంచ కప్ లో వీరిద్దరూ కీలక పాత్ర వహించారు. గ్రౌండ్ లో వికెట్ కీపింగ్ టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోని, బ్యాట్ తో పరుగుల వరద పారించడంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎంత చురుకుగా పాల్గొంటారో తెలిసిందే. ఇదిలా ఉంటే.. కీపింగ్ చేసే ధోనీ బౌలింగ్ చేస్తుంటే.. పరుగుల వరద పారించే కోహ్లీ వికెట్ల వెనుక కీపింగ్ చేయడం మీరు ఎప్పుడైనా చూశారా ? అవును ఇది వాస్తవం. ఓ టెస్ట్ మ్యాచ్ లో కాసేపు తమ పొజిషన్స్ మార్చుకొని ఆడుతూ ఆడియెన్స్ ని అలరించారు. న్యూజిలాండ్ తో జరిగిన ఓ మ్యాచ్ ల ధోనీ ఓ ఓవర్ బౌలింగ్ చేసి 5 పరుగులు సమర్పించుకున్నాడు.

Advertisement

విరాట్ కోహ్లీ కీపిం్ చేశారు. ఈ టెస్ట్ మ్యాచ్ కొద్ది సంవత్సరాల కిందట జరిగిందే అయినప్పటికీ తాజాగా వీరి ఆటకు సంబంధించిన వీడియోను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోను చూసి అభిమానులు ట్రెండ్, షేర్ చేస్తున్నారు. 2008 నుంచి ధోనీ, కోహ్లీలు టీమిండియాకి ఎన్నో గుర్తుండిపోయే విజయాలను అందించారు. 2008 నుంచి 2019 వరకు వీరిద్దరూ డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నారు. తరువాత ధోనీ రిటైర్ మెంట్ అయ్యారు. ప్రస్తుతం కోహ్లీ మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు. వీరిద్ధరి మధ్య మంచి అనుబంధం కూడా ఉంది. ముఖ్యంగా కోహ్లీ.. చాలా సందర్భాల్లో ధోనిపై తనకు ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నాడు. ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి టైటిల్ ని గెలుచుకుంది. కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీ జట్టు ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. కానీ విరాట్ కోహ్లీ మాత్రం 639 పరుగులు చేశాడు. ఈ ఐపీఎల్ లో విరాట్ రెండు సెంచరీలు కూడా చేయడం విశేషం.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 కాంగ్రెస్ పార్టీలోకి అంబటి రాయుడు… మల్కాజ్ గిరి నుంచి పోటీ ?

రెజ్లర్లకు మద్దతుగా నిలుస్తున్న క్రికెటర్లు.. అలాంటి పని చేయొద్దంటూ..?

 బ్రహ్మానందం కి కాబోయే కోడలు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading