Home » మెగాస్టార్,బాలయ్య కలిసి నటించిన మూవీ ఉందని మీకు తెలుసా..?

మెగాస్టార్,బాలయ్య కలిసి నటించిన మూవీ ఉందని మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala

ఏ ఇండస్ట్రీలో అయినా జనరేషన్ కు తగ్గట్టుగా సినిమాలు వస్తేనే వాటిని జనాలు యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే సినిమాలు చూడటం కష్టమవుతుంది. ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి,బాలకృష్ణ అంటే తెలియని వారు ఉండరు. ప్రస్తుతం వీరిద్దరూ ఆరు పదుల వయస్సు దాటిన యువ హీరోలతో పోటీపడుతూ సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. అలాంటి ఈ స్టార్ హీరోలు కలిసి నటించిన చిత్రం కూడా ఉంది. అదేంటో చూద్దామా.. గత కొన్నేండ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు రాలేదు.

కానీ ఈ మధ్యకాలంలో చాలా మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. నాలుగు దశాబ్దాల కిందట ఏఎన్ఆర్ ఎన్టీఆర్, కృష్ణ శోభన్ బాబు, చిరంజీవి కృష్ణంరాజు లాంటి అగ్ర హీరోలు కలిసి నటించారు. 1990 తర్వాత హీరోల మధ్య ఇమేజ్ సమస్య తలెత్తింది. దీంతో మల్టీ స్టారర్ ల సినిమాలు ఆసక్తి చూపలేదు. కానీ గత కొంతకాలంగా పరిస్థితులు మళ్ళీ మారుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి నటించడం కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ వెంకటేష్, వెంకటేష్ మహేష్ బాబు కలిసి చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ రామ్ చరణ్, చిరంజీవి రామ్ చరణ్ లాంటి టాప్ హీరోలు కలిసి నటిస్తున్నారు. అయితే బాలకృష్ణ చిరంజీవి కూడా ఓ సినిమాలో కనిపించారు. వెంకటేష్ హీరోగా చేసిన త్రిమూర్తులు చిత్రంలోని ఓ పాటలో చిరంజీవి బాలయ్య కనిపిస్తారు. వీరితో పాటుగా శోభన్ బాబు, నాగార్జున,కృష్ణ కూడా డాన్స్ చేస్తారు. ఆ తర్వాత వీరు మరో సినిమాలో కనిపించలేదు.

మరికొన్ని ముఖ్య వార్తలు:

Visitors Are Also Reading