Home » జూన్ 01 నుంచి అమలయ్యే కొత్త రూల్స్ ఇవే..!

జూన్ 01 నుంచి అమలయ్యే కొత్త రూల్స్ ఇవే..!

by Anji
Ad

ప్రస్తుతం నెలకొక కొత్త రూల్స్ వస్తున్నాయి. అదేవిధంగా జూన్ నెలలో కూడా కొత్త రూల్స్ వచ్చాయి. ఈ నిబంధనలతో కాస్త మీ జేబుకు చిల్లు పడే అవకాశాలున్నాయి. ఆధార్ కార్డు, పెట్టుబడులు, ఫిక్స్ డ్ డిపాజిట్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ సబ్సీడీలు, విదేశీ క్రికెట్ కార్డు పేమెంట్లు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వంటి చాలా అంశాల్లో ఉన్నాయి. ప్రతీ నెల ఒకటో తేదీన గ్యాస్ ధరలను పెరుగుతుంది. పెట్రోల్, డిజీల్ ధరలలో మార్పులుండవచ్చు. 

Advertisement

ఆధార్ అప్డేట్ :

ఆధార్ కార్డు ఉన్న వారు తమ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. పేరు, అడ్రస్ వంటి వివరాలను ఆన్ లైన్ ద్వారా ఒక్కరూపాయి కూడా చెల్లించకుండా మార్చుకునే అవకాశం కల్పించింది. ఈ అవకాశం జూన్ 14 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని గుర్తుంచుకోవాలి. 

గ్యాస్ ధరలు : 

Manam news

ప్రతీ నెల 1 తేదీ చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తూ.. ఉంటాయి. ఆ ధరలు పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. గత నెల వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గించాయి. వచ్చే నెల కూడా మార్పు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. 

Advertisement

బ్యాంకు ఖాతాల్లోని అన్ క్లెయిమ్ డిపాజిట్లు :

బ్యాంకుల్లో చాలా మంది ఫిక్స్ డ్ డిపాజిట్, సేవింగ్స్, కరెంట్ అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ చేసి క్లెయిమ్ చేసుకొని వారు చాలా మంది ఉన్నారు. నామినీ కోసం ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 01 నుంచి ప్రారంభం కానుంది. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా జూన్ 01 నుంచి 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్, బైకు కొనుగోలు చేయాలనుకునే వారికి జూన్ 01 నుంచి రూల్స్ మార్చుతుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సీడీలో భారీ కోత విధించనుంది. గరిష్టంగా అందిస్తున్న సబ్సీడీని పరిమితి 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాలపై ప్రస్తుతం KWH కి రూ.15వేలు నుంచి KWH రూ.10వేలు తగ్గించింది. ఈ రూల్స్ ఫాలో అవ్వడం మంచిది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

విజయ్ దేవరకొండకి జోడీగా సాయిపల్లవి.. కానీ ఆ సినిమా ఎలా మిస్ అయిందంటే ?

Jr. NTR పెళ్లికి ముందే ఆ హీరోయిన్ ని పిచ్చిగా ప్రేమించారా.. కానీ..?

ఈ రెండు లక్షణాలు ఉన్న భార్య దొరికితే.. ప్రతి మగాడి జీవితం పండగే

Visitors Are Also Reading