సోషల్ మీడియా ప్రపంచంలో అనునిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా, మరికొన్ని భయంకరంగా ఉంటాయి. అయితే తాజాగా కోట్ల కట్టలతో ఉన్న ఓ వాహనం నడిరోడ్డుపై ఆగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. చెన్నైలో రూ.535 కోట్ల నగదుతో వెళుతున్న ఓ ట్రక్కు నడిరోడ్డుపై ఆగిపోయింది.
Advertisement
రిజర్వు బ్యాంక్ నుంచి విపుల్లాపురం తరలిస్తుండగా ఆగిపోయిన ట్రక్. ముంబై రిజర్వు బ్యాంకు నుంచి రూ.535 కోట్లతో ఓ కంటైనర్ బయలుదేరింది. ఈ భారీ నగదును విపుల్లపురానికి తరలిస్తుండగా తాంబారం ప్రాంతంలో మెయిన్ రోడ్డుపై అకస్మాత్తుగా బ్రేక్ డౌన్ కావడంతో ఆగిపోయింది. ఇంత భారీ మొత్తాన్ని తరలిస్తున్న కంటైనర్ నడిరోడ్డుపై ఆగిపోవడంతో వెంటనే డ్రైవర్, సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Advertisement
పోలీసులకు కంటైనర్ ఆగిపోయిన చోటికి చేరుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే భారీ కోట్ల రూపాయలతో బయలుదేరిన కంటైనర్ రోడ్డుపై ఆగిపోయింది అన్న విషయం తెలిసిన కొంతమంది జనాలు గుంపులుగా తరలివచ్చారు. ప్రస్తుతం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
కాంగ్రెస్ లోకి మళ్లీ రానున్న కోమటి రెడ్డి రాజగోపాల్..క్లారిటీ ఇదే
IPL 2023 : ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్న గవాస్కర్..ఫోటో వైరల్
SPY Movie : నిఖిల్ స్పై టీజర్ రిలీజ్..దుమ్ములేసిపోయింది