తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ హీరోగా నాగచైతన్య ఓ మోస్తారుగా అభిమానులను సంపాదించుకొని కొనసాగుతున్నారు. ఇప్పటికి ఆయన ఎన్నో సినిమాలు తీశారు. అందులో కొన్ని సినిమాలు హిట్ అయితే మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. అలాంటి అక్కినేని అబ్బాయిని తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ప్రేమించి వివాహం చేసుకుంది. అలా ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట విడాకులు ఎందుకు తీసుకుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
Advertisement
ఇండస్ట్రీలో నాగ చైతన్య కంటే ఎక్కువ స్టార్డం సమంతకే ఉంది. ఇద్దరు కలిసి ఏం మాయ చేసావే సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత మనం సినిమాలో ఇద్దరు రియల్ భార్యాభర్తలు అందరిని మెప్పించారని చెప్పవచ్చు. దీని తర్వాత మజిలీ , ఆటోనగర్ సూర్య ఇలా పలు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే వీరు సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా భార్యాభర్తలై ఇండస్ట్రీలోనే బ్యూటిఫుల్ కపుల్ గా వారి జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.సడన్ గా విడాకులు తీసుకొని విడిపోయారు. వీరు విడిపోవడానికి ఇప్పటివరకు కారణం ఏంటో ఎవరికి తెలియదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. కేవలం సమంత అహంకారం వల్లే విడాకుల వరకు వచ్చిందని అంటున్నారు. ఆ రాత్రి సమంతా కాంప్రమైజ్ అయి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదని తెలియజేస్తున్నారు.
Advertisement
ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగిందయ్యా అంటే .. ఒక ఈవెంట్ లో జరిగిన గొడవ సమంత నాగచైతన్య విడాకులకు కారణమని తెలుస్తోంది. ఆరోజు రాత్రి నాగచైతన్య సమంత చాలా పోట్లాడుకున్నారని, సమంత ను నాగార్జున ఎంత కాంప్రమైజ్ చేసిన సమంత అసలు వినకుండా తన ఈగో చూపించిందని అంటున్నారు. ఆమె ఆ రాత్రి కాస్త కాంప్రమైజ్ అయి ఇగో తగ్గించుకొని ఉంటే ఈరోజు పరిస్థితి ఇలా ఉండేది కాదని, సమంత కాస్త మద్యం మత్తులో ఉండటం వల్ల గొడవ ఎక్కువగా జరిగిందని సమాచారం. ఏది ఏమైనా అనుకోకుండా జరిగిన గొడవ వల్ల విడిపోయి ఇద్దరు బాధపడుతున్నారని వీరు ఇప్పుడు కలిసి అంటే మాత్రం పాపో బాబో పుట్టి వీరు హ్యాపీగా ఉండే వారిని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు:
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త..!
- ఆ హీరోయిన్ వద్దని ఎంతమంది చెప్పినా వినని పవన్… ఆ తర్వాత రిజల్ట్ తో షాక్..!
- వెంకటేష్ రిజెక్ట్ చేసిన మూవీతో ఫ్లాప్ ను అందుకున్న ప్రభాస్… ఆ మూవీ వెంకటేష్ కనక చేసుంటే ఇక అంతే..!