Home » వెంకటేష్ రిజెక్ట్ చేసిన మూవీతో ఫ్లాప్ ను అందుకున్న ప్రభాస్… ఆ మూవీ వెంకటేష్ కనక చేసుంటే ఇక అంతే..!

వెంకటేష్ రిజెక్ట్ చేసిన మూవీతో ఫ్లాప్ ను అందుకున్న ప్రభాస్… ఆ మూవీ వెంకటేష్ కనక చేసుంటే ఇక అంతే..!

by AJAY
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరు అయిన విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విజయాలను అందుకొని అద్భుతమైన హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న వెంకటేష్ తాజాగా రానా నాయుడు అనే వెబ్ సిరీస్లో రానా తో కలిసి నటించాడు.

Advertisement

ఈ వెబ్ సిరీస్ బోల్డ్ కంటెంట్ తో రూపొందింది. ఎన్నో సంవత్సరాల పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాల్లో ఎక్కువ శాతం నటించి ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ప్రేక్షకుల దోచుకున్న వెంకటేష్ “రానా నాయుడు” లాంటి బోల్డ్ కంటెంట్ తో రూపొందిన వెబ్ సిరీస్ లో నటించి ప్రేక్షకులను బాగానే అలరించాడు. ఈ వెబ్ సిరీస్ కు అదిరిపోయే రేంజ్ వ్యూస్ లభించాయి. ప్రస్తుతం వెంకటేష్… శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న సైన్ధవ్ అనే భారీ యాక్షన్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు.

Advertisement

వెంకటేష్ చాలా సెలెక్టివ్ గా సినిమా కథలను ఎంచుకొని మూవీల్లో నటిస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఇప్పటికే వెంకటేష్ తన కెరియర్లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోగా… కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ లను కూడా ఎదుర్కొన్నాయి. అందులో భాగంగా కొంతకాలం క్రితం వెంకటేష్ తన వద్దకు వచ్చిన ఒక కథను రిజెక్ట్ చేయగా… అదే కథతో రూపొందిన సినిమాలో ప్రభాస్ నటించి ఫ్లాప్ ను ఎదుర్కొన్నాడు.

ఆ సినిమా ఏదో తెలుసుకుందాం… ప్రభాస్ కొంత కాలం క్రితం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన రాదే శ్యామ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కథను మొదట ఈ మూవీ దర్శకుడు వెంకటేష్ కు వినిపించాడట… ఈ కథ అంతగా నచ్చని వెంకటేష్ ఈ మూవీ కథను రిజెక్ట్ చేయగా… ఆ తర్వాత ఇదే కథను ఈ దర్శకుడు ప్రభాస్ కు వినిపించగా ప్రభాస్ కు ఈ మూవీ కథ ఎంతో బాగా నచ్చడంతో ఈ మూవీలో హీరోగా నటించినట్లు తెలుస్తోంది. కాగా చివరకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

Visitors Are Also Reading