Home » ఆ హీరోయిన్ వద్దని ఎంతమంది చెప్పినా వినని పవన్… ఆ తర్వాత రిజల్ట్ తో షాక్..!

ఆ హీరోయిన్ వద్దని ఎంతమంది చెప్పినా వినని పవన్… ఆ తర్వాత రిజల్ట్ తో షాక్..!

by AJAY
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ నటించిన ఏ సినిమాకు అయినా టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా మొదటి వారం రోజుల పాటు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వస్తూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే పవన్ తన కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలలో హీరోగా నటించాడు. అలా పవన్ తన కెరీర్లో నటించిన బ్లాక్ బాస్టర్ మూవీలలో గబ్బర్ సింగ్ మూవీ ఒకటి.

Advertisement

ఈ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. బండ్ల గణేష్ నిర్మించిన ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ కంటే ముందు పవన్ నటించిన అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయి. ఈ మూవీతో పవన్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కంటే ముందు శృతిహాసన్ కూడా చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలు చెందడంతో ఇండస్ట్రీలో శృతికి ఐరన్ లెగ్ అనే పేరు కూడా వచ్చింది.

Advertisement

అలాంటి పేరును ఈ మూవీ తోనే శృతి చెరిపేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కథ మొత్తం సెట్ అయిన తర్వాత ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలి అని మూవీ బృందం అనుకుంటున్నా సమయంలో పవన్ ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ అయితే బాగుంటుంది అని సూచించాడట… దానితో బండ్ల గణేష్… శృతికి వరసగా ఫ్లాప్ లు వస్తున్నాయి ఈమె కాకుండా మన సినిమాలో ఎవరైనా వేరే వాళ్ళని హీరోయిన్గా పెట్టుకుందాం అని అన్నాడట… దానితో నీకేమైనా పెద్ద హిట్లు ఉన్నాయా ఏమి మాట్లాడకుండా ఆమెను హీరోయిన్గా సినిమాలో పెట్టు అన్నాడట.

అలాగే హరీష్ శంకర్ కూడా శృతిని కాకుండా వేరే నటిని ఈ మూవీలో హీరోయిన్గా పెడదాం అన్నాడట… కాకపోతే పవన్ మాత్రం కచ్చితంగా ఈ సినిమాలో శృతిని హీరోయిన్గా పెడదాం. ఎందుకంటే ఆమెకు నేను మాటిచ్చాను అని చెప్పాడంట. చివరగా శృతిని ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అలా పవన్ ఎంపిక ఈ సినిమా విషయంలో సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే శృతికి కూడా ఈ సినిమాతో ఐరన్ లెగ్ సెంటిమెంట్ పోయి గోల్డెన్ లెగ్ సెంటిమెంట్ వచ్చేసింది.

Visitors Are Also Reading