చిన్న పిల్లల చేష్టలకు వారి మొండితనానికి విసిగిపోయిన పేరెంట్స్ వారికి మొబైల్స్ అందజేయడం మనం చూస్తూనే ఉంటాం. మీరు కూడా మీ పిల్లలకు అదేవిధంగా ఇస్తున్నట్టయితే కొంచెం అలెర్ట్ గా ఉండండి. ఎందుకంటే.. ఇప్పటి పిల్లలు చాలా మోనార్క్ లు. చూసిన వాటిని ఇలాగే గ్రహిస్తారు. నిదర్శనమైన షాకింగ్ ఘటన ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆరేళ్ల పిల్లాడు మొబైల్ లో యూట్యూబ్ చూస్తూ కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అంతేకాదు.. ఏకంగా ఆ డ్రైవింగ్ టెస్ట్ ను తన తండ్రి కారుపైనే ప్రయోగించాడు. తన మూడేళ్ల చిన్నారి చెల్లిని కూడా తన వెంట కారులో తీసుకెళ్లడం కొసమెరుపు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Advertisement
మలేషియాలోని లంకావిలో ఈ ఘటన చోటు చేసుకుంది. యూట్యూబ్ లో కారు డ్రైవింగ్ కి సంబంధించిన వీడియో చూసిన ఆరేళ్ల చిన్నోడు.. గుట్టు చప్పుడు కాకుండా తండ్రి కారు తాళాలు తీసుకున్నాడు. బయటికి వెళ్లడానికి ప్లాన్ చేశాడు. మూడేళ్ల చెల్లిని తన వెంట తీసుకెళ్లాడు. దాదాపు రెండున్నర కిలోమీటర్లు డ్రైవింగ్ చేశాడు. చివరికీ ఓ స్థంభాన్ని ఢీ కొట్టాడు. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వచ్చి ప్రమాదానికి గురైన కారును పరిశీలించారు. డ్రైవింగ్ చేస్తూ.. ఆరేళ్ల పిల్లాడు కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
Advertisement
అన పక్కనే మూడేళ్ల వయస్సు ఉన్న చిన్నారి ఉన్నారు. వారిద్దరినీ చూసి అందరూ షాక్ కి గురయ్యారు. వారిని కిందించి దించి అసలు విషయం అడగ్గా.. చెప్పిన విషయాలు విని కంగుతిన్నారు. తాను తన చెల్లితో కలిసి బొమ్మలు కొనుక్కునేందుకు షాప్ వద్దకు వెళ్తున్నానంటూ సమాధానం చెప్పాడు. ఈ ప్రమాదంలో చిన్నారి దవడకు చిన్న గాయం కాగా.. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బ తింది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాధ స్థలం వద్దకు వెళ్లి.. వివరాలను సేకరించారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :