Home » అక్కినేని ఫ్యామిలీకి కలిసి రాని ఆ టైటిల్స్… మరోసారి అదే నిజం అయ్యింది..!

అక్కినేని ఫ్యామిలీకి కలిసి రాని ఆ టైటిల్స్… మరోసారి అదే నిజం అయ్యింది..!

by AJAY
Published: Last Updated on
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన నటులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగించాడు. ఆ తరువాత ఆయన వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున కూడా నాగేశ్వరరావు లాగానే ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఇప్పటికి కూడా కెరీర్ను కొనసాగిస్తున్నాడు.

Advertisement

ఇది ఇలా ఉంటే నాగార్జున నట వారసులుగా నాగచైతన్య… అఖిల్ ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే గత కొంతకాలంగా అక్కినేని ఫ్యామిలీ నుండి సినిమాలు వరుసగా వస్తున్నప్పటికీ ఆ సినిమాలు ఏవి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడం లేదు. ఈ ఫ్యామిలీ నుండి వచ్చిన సినిమాలలో పోయిన సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి బంగార్రాజు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

Advertisement

ఆ తర్వాత ఈ హీరోలు పలు మూవీలలో నటించినప్పటికీ ఆ సినిమాలు ఏవి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోలేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ హీరోలు ఎక్కువ శాతం ఇంగ్లీష్ టైటిల్స్ తో వచ్చిన సినిమాలలో హీరోలుగా నటిస్తూ వస్తున్నారు. కాకపోతే ఈ హీరోలు ఇంగ్లీష్ టైటిల్స్ తో వస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. నాగార్జున వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ మూవీలతో అపజయాలను అందుకున్నాడు.

తాజాగా ఈ సంవత్సరం అఖిల్ “ఏజెంట్” అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. తాజాగా నాగ చైతన్య “కస్టడీ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేక పోతుంది. ఇలా ఈ మధ్య కాలంలో అక్కినేని ఫ్యామిలీ వారు ఇంగ్లీష్ టైటిల్స్ తో వచ్చిన సినిమాలలో నటించి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరిచారు.

Visitors Are Also Reading