Home » అలనాటి ఆ హీరోయిన్లతో ఎన్టీఆర్, అక్కినేని ఎవరెవరూ ఎలా ఉండోవారో తెలుసా ?

అలనాటి ఆ హీరోయిన్లతో ఎన్టీఆర్, అక్కినేని ఎవరెవరూ ఎలా ఉండోవారో తెలుసా ?

by Anji
Ad

తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్ళలాగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఉండేవారు. ఎన్టీఆర్ వయస్సులో ఏఎన్ఆర్ కంటే 16 నెలలు పెద్దవాడు. సినిమాల విషయంలో మాత్రం ఎన్టీఆర్ కంటే ఏఎన్ఆర్ ఐదు సంవత్సరాల 10 నెలలు సీనియర్ అట. చెన్నై నుంచి చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కి  తరలిరావడానికి ఏఎన్నార్, ఎన్టీఆర్  పాత్ర చాలా కీలకమేనట. ఒకానొక సమయంలో టాప్ హీరోల పొజిషన్ కోసం వీరిద్దరూ పోటీ పడ్డారు.

Also Read : మెహ్రీన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి ఐఏఎస్ తో ఎంగేజ్ మెంట్…ఫోటోలు వైరల్…!

Advertisement

పౌరాణిక చిత్రాలతో ఎన్టీఆర్ సూపర్ హిట్లు  కొడుతుంటే.. జానపద సినిమాలతో ఏఎన్ఆర్ రాణించేవారు. వీరిద్దరూ ఎప్పుడు సినిమాలతో పోటీ పడ్డారే తప్ప వారికి ఎప్పుడూ పోటీ లేదు. ఇద్దరు హీరోల సరసన చాలామంది కథానాయకులుగా నటించారు. ఏఎన్ఆర్ తో ఉన్నంత చనువుగా ఎన్టీఆర్ తో హీరోయిన్స్ ఉండేవారు కాదట. నాగేశ్వరరావు చాలా చలాకి పర్సన్. తన పక్కన నటించే ప్రతి హీరోయిన్ పై జోకులు వేస్తుంటాడు. సీరియస్ అయినా వారు పెద్దగా పట్టించుకోరు. అక్కినేని కేవలం తెలుగులో మాత్రమే కాకుండా వివిధ భాషల్లో నటించి బయటి హీరోయిన్స్ తో కూడా నటించాడు అందరితో కూడా ఆయనకు మంచి అభినవ సంబంధం ఉంది.

Advertisement

Also Read :   ఎన్టీఆర్ తన ఇద్దరూ కొడుకుల పెళ్లికి ఎందుకు హాజరు కాలేదు.. కారణం అదేనా ?

Manam News

నందమూరి తారకరామారావు విషయానికి వస్తే.. సెట్స్ లో చాలా సీరియస్ గా ఉంటారు. సినిమా సెట్ కి వచ్చావా వెళ్ళిపోయావా అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు ఎన్టీఆర్. ఆయనతో నటించాలన్న కూడా కొందరు హీరోయిన్స్ భయపడుతూ ఉండేవారట. షూటింగ్ కి సమయానికి రావడం లేదంటూ స్టార్ హీరోయిన్ కే.ఆర్ విజయపైన ఎన్టీఆర్ అప్పట్లో కోర్టులో కేసు వేయడం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసినదే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకొని తెలుగు జాతి గర్వించదగ్గ సినిమాలను వీరిద్దరూ హీరోలు అందించారు. ఇప్పటికి కూడా టీవీలలో వచ్చే ఎన్టీఆర్ ఏఎన్నార్ సినిమాలను ప్రేక్షకులు రెప్ప కొట్టకుండా చూస్తున్నారంటే వారికి ఎంతటి క్రేజీ ఉందో ఇంక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

Also Read :  బాలయ్య ఎంత క‌ట్నం తీసుకున్నారు? వ‌సుంధ‌ర ఎవ‌రి కూతురు?

Visitors Are Also Reading