NTR కి ఏడుగురి సంతానం. వీరిలో 7గురు అబ్బాయిలు, 4 గురు అమ్మాయిలు. 11 మందిలో చిన్నవాడు బాలకృష్ణ. చిన్నవాడు కావడంతో అందరికీ బాలకృష్ణ అంటే చాలా ఇష్టం! NTR ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండగా…NTR భార్య బసవతారకం కొడుకు పెళ్లి కోసం NTRపై ఒత్తిడి తెచ్చారట!
ఎన్నికల హడావుడిలో ఉన్న NTR ఈ భారాన్ని తన సహచరుడైన నాదెండ్ల భాస్కర రావుకు అప్పగించాడట. భాస్కర రావు తన బంధువైన దేవరపల్లి సూర్యారావు కూతురైన వసుంధరను చూపించాడట., అమ్మాయి అందరికీ నచ్చడంతో 8 December 1982 వసుంధరతో బాలకృష్ణ వివాహం జరిగింది. దేవరపల్లి సూర్యారావు శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్ పోర్ట్ ఓనర్. పెళ్లికి కట్నం ఏం తీసుకోలేదట., పెళ్ళి కూతురి తండ్రి కూతురికి కానుకగా హైద్రాబాద్ లో 10 లక్షల రూపాయలతో ఇంటిని కట్టించారట!
బాలకృష్ణ వసుంధరలకు ముగ్గురు సంతానం..కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్విని, కొడుకు మోక్షజ్ఞ. బ్రాహ్మణి వివాహం నారాలోకేష్ తో కాగా, తేజస్విని వివాహం గీతం యూనివర్సిటీ ఎండి. శ్రీభరత్ తో అయ్యింది.
Also Read: బాలకృష్ణ కమర్షియల్ యాడ్స్ లో నటించకపోవడానికి కారణం ఏమిటంటే..?