Home » మెహ్రీన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి ఐఏఎస్ తో ఎంగేజ్ మెంట్…ఫోటోలు వైరల్…!

మెహ్రీన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి ఐఏఎస్ తో ఎంగేజ్ మెంట్…ఫోటోలు వైరల్…!

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటి మనులలో ఒకరు అయినటువంటి మెహరీన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెహరీన్… నాచురల్ స్టార్ నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందినటువంటి కృష్ణగాడి వీర ప్రేమ గాధ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకుందు.

Advertisement

ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ ముద్దుగుమ్మ ఎఫ్ 3 అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒక హీరోయిన్గా నటించింది. విక్టరీ వెంకటేష్… ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.

Advertisement

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయ్‌తో మెహరీన్ పెళ్లి కుదిరిన విషయం మన అందరికీ తెలిసిందే. 2021 మార్చిలో మెహ్రీన్‌, భవ్య భిష్ణోయ్‌ నిశ్చితార్థం జైపూర్‌‌లో చాలా ఘనంగా జరిగింది.

 

ఆ తర్వాత కొంతకాలానికి కొన్ని అని వారి కారణాల వల్ల వీరిద్దరి విడిపోయారు. ఆ తర్వాత వీరిద్దరూ ఎవరి పనులవారు బిజీ అయిపోయారు. ప్రస్తుతం మెహరీన్ సినిమాలపై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఉంటే… భవ్య పొలిటికల్ లో ఫుల్ బిజీ అయిపోయాడు. ఇలా ఎవరి పనులతో వారు ఫుల్ బిజీ అయిపోయిన సమయంలో భవ్య … ఐఏఎస్‌ ఆఫీసర్‌ పరి భిష్ణోయ్‌ అనే అమ్మాయిని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Visitors Are Also Reading