సాధారణంగా స్త్రీ బాగుంటే సమాజం బాగుంటుంది. ఆ స్త్రీ బాగుంటే దేశం బాగుంటుంది.స్త్రీ ఎప్పటికప్పుడు తమ పిల్లలను అబ్జర్వ్ చేస్తుండాలి. అదేవిధంగా స్త్రీ తన భర్తను ఎంత ఆకట్టుకోగలిగితే.. ఆమె ఆనందాన్ని కలుగజేస్తే భర్త మరో స్త్రీ వద్దకు వెళ్లడు. ముఖ్యంగా స్త్రీ భర్త తినే ఆహారం తక్కువైతేనే వెంటనే గమనిస్తుంటుంది. భర్తతో స్త్రీ ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడితే ఆ భర్త చాలా సంతోషంగా ఉంటాడు. ముఖ్యంగా అర్థం చేసుకునే మనుషులు తక్కువవ్వడం వల్ల చాలా సమస్యలు చోటు చేసుకుంటాయి.
Also Read : “మన టాలీవుడ్ సెలెబ్రెటీల పెళ్లి పత్రికలు చూసారా ?
Advertisement
ముఖ్యంగా ఎవ్వరికైనా మన అనే ఫీలింగ్ కలగాలి. పూర్వకాలంలో ప్రతీ ఇంటికి ల్యాండ్ లైన్ ఉండేది. ఆ ల్యాండ్ లైన్ చాలా బెటర్. ప్రస్తుతం సెల్ ఫోన్లు పోయి ల్యాండ్ లైన్లు మళ్లీ వస్తే మన బతుకులు బాగుపడే ఛాన్స్ ఉంటుంది. అందరూ రౌండ్ టేబుల్ పై కూర్చొని వడ్డించుకుని తినే రోజులు పోయాయి ఇప్పుడు. అలాంటి రోజులు మళ్లీ వస్తే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా అందరూ కూర్చొని ఒకే చోట చదువుకుంటే చాలా బాగుంటుంది.
Advertisement
Also Read : మీకు కాబోయే భార్యతో పొరపాటున కూడా ఈ విషయాలను చర్చించకండి.. జాగ్రత్త !
టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల అమ్మతో, నాన్నతో చెప్పుకోకుండా ప్రతిదీ ఫోన్ తో నే చెప్పుకుంటున్నారు. ఈ మొబైల్ ఫోన్ల కారణంగా భార్యభర్తలు సైతం వారి కష్టాలను పంచుకోవడం లేదు. దీంతో శరీరానికి, మనసుకు మించిన కోరికలు పుడుతున్నాయి. రకరకాలుగా తయారవుతుంటారు. ముఖ్యంగా మనిషి బతికి ఉన్నన్ని రోజు పక్షులకు గింజలు వేయగలగాలి. పశువులకు గడ్డి వేయగలగాలి. ఓ చిరునవ్వు నవ్వాలి. మనిషి బతికితే ఇలా బతకాలిరా అనేటట్టు ఉండాలి. నిజంగా చనిపోతే ఇలా పోవాలిరా అనిపించాలి. అలాంటి చిట్కాలను పాటిస్తే జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది.
Also Read : 18ఏళ్ళు నిండిన అబ్బాయి, అమ్మాయి OYO రూమ్ లో దొరికితే ఏం జరుగుతుందో తెలుసా..?