Home » 18ఏళ్ళు నిండిన అబ్బాయి, అమ్మాయి OYO రూమ్ లో దొరికితే ఏం జరుగుతుందో తెలుసా..?

18ఏళ్ళు నిండిన అబ్బాయి, అమ్మాయి OYO రూమ్ లో దొరికితే ఏం జరుగుతుందో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఓయో రూమ్స్ అనేవి టూరిస్ట్లకు చాలా అనువైన ప్లేసులుగా మారాయి. ఏదైనా పట్టణాలకు టూర్ కి వెళ్ళినప్పుడు మళ్లీ తిరిగి రావడానికి సమయం పడితే ఓయో రూమ్స్ బుక్ చేసుకొని అందులో రెస్ట్ తీసుకుంటారు. చాలా తక్కువ అమౌంట్ తో ఎక్కువ సౌకర్యాలు కలిగిన సంస్థ ఓయో. అలాంటి ఓయో సంస్థలో అప్పుడప్పుడు కొంతమంది అసాంఘిక కార్యక్రమాలు చేసి పోలీసులకు దొరికే సందర్భాలు అనేకం మనం చూస్తూనే ఉంటాం. మరి ఓయో రూంలో 18 ఏళ్లు నిండిన అమ్మాయి, అబ్బాయి దొరికితే చట్టపరమైన చర్యలు ఉంటాయా లేదా అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

also read:ఛార్మి వల్లేనా ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోలేదు?

Advertisement

సాధారణంగా ఓయో రూమ్స్ గాని, లేదంటే ఏదైనా హోటల్ రూమ్స్ కానీ, క్లబ్ కు కానీ వెళ్ళినప్పుడు వెళ్లిన ఇద్దరి ఆధార్ కార్డులు తీసుకొని రూమ్స్ ఇస్తున్నారు. కానీ ఒకప్పుడు ఎక్కువ అమౌంట్ చెల్లిస్తే రూమ్స్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది వచ్చిన వ్యక్తులకు సంబంధించి ఐడెంటి కార్డు ఇస్తేనే రూమ్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. అయితే ఇద్దరి ఆధార్ కార్డులపై భార్యాభర్తలు అయితే ఇంటిపేరు ఒకే విధంగా ఉండాలి. అలాగే వారి యొక్క ఆధార్ కార్డు వివరాలు చెక్ చేసి సరైందా కాదా అని చూస్తారు. అలా సరి చేసుకున్న తర్వాతే రూమ్స్ ఇచ్చే రూల్స్ ఉన్నాయి. కానీ కొంతమంది రూమ్స్ కు వచ్చి ఇద్దరం మేజర్లమని చెప్పి మాకు కలిసి ఉండటానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి మేం సహజీవనం చేస్తున్నామని రూమ్స్ తీసుకుంటారు.

Advertisement

also read:“మన టాలీవుడ్ సెలెబ్రెటీల పెళ్లి పత్రికలు చూసారా ?

ఈ తరుణంలో పోలీసులకు పట్టుబడితే మీరు చెప్పిన విషయాలను వారు అస్సలు నమ్మరు. ఈ తరుణంలో అమ్మాయిని పీఠా యాక్ట్ కింద బుక్ చేసి, ఒకవేళ అమ్మాయి పర్సులో డబ్బులు ఉంటే ఈ డబ్బులు ఆయన ఇచ్చారు అని నువ్వు డబ్బుకు శరీరాన్ని అమ్ముకుంటున్నావని ఒక కేసును బుక్ చేస్తారు. పీట యాక్ట్ కింద అరెస్ట్ అయితే అమ్మాయిని మహిళ సంరక్షణ కేంద్రానికి పంపిస్తారు. ఇక అబ్బాయి మాత్రం తప్పనిసరిగా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఓయో రూమ్స్ కీ వెళ్లేటప్పుడు సరైన ఆధారాలు తీసుకొని వెళ్లాలని కొంతమంది అడ్వకేట్ నిపుణులు తెలియజేస్తున్నారు.

also read:Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఓ శుభవార్త వింటారు

Visitors Are Also Reading