ఐపీఎల్ 2023 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. గెలుస్తాయి అనుకున్న జట్టు ఓడిపోతూ, ఓడిపోతాయి అనుకున్న జట్లు గెలుస్తూ ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను పంచుతోంది ఈసారి ఐపీఎల్. ఇక తాజాగా ముంబై వర్సెస్ చెన్నై మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై విజయం సాధించింది. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్ లో ముంబై ఇండియన్స్ తో మ్యాచ్లో ధోని మరోసారి తన మాస్టర్ మైండ్ పవర్ చూపించాడు.
READ ALSO : ఆఫర్స్ లేకున్నా… కూతురి కోసం కాస్ట్లీ కారు కొన్న సురేఖ వాణి
Advertisement
విషయంలోకి వెళితే ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ మీచెల్ సాంట్నర్ వేశాడు. అంతకుముందు ఓవర్ లోనే ఇషాన్ కిషన్ పెవీలియన్ చేరడంతో సూర్య కుమార్ క్రిజులోకి వచ్చాడు. ఇక ఓవర్ లో వేసిన రెండో బంతి వైడ్ బాల్ అనే ఉద్దేశంతో సూర్య వదిలేయడం ధోని షార్ప్ గా స్పందించి బంతి అందుకోవడం జరిగిపోయాయి. దీంతో ధోని అంపైర్ కు క్యాచ్ అవుట్ కు ఆప్పీల్ చేశాడు.
Advertisement
READ ALSO : విడాకుల తర్వాత..సమంత కోసం చీకటి గదిలో నాగచైతన్య ఏడ్చాడా…?
అయితే గ్లోవ్స్ కు తగిలివెళ్లినట్లు అనిపించడంతో సూర్య కూడా వెళ్లడానికి సిద్ధమయ్యారు. కానీ అంపైర్ వైడ్ ఇవ్వడంతో సూర్య ఆగిపోయారు. వెంటనే ధోని క్యాచ్ కోసం రివ్యూ కోరారు. రిప్లై లో బంతి గ్లోవ్స్ కు తగిలినట్లు తేలింది. దీంతో సూర్యకు నిరాశ తప్పలేదు. ఇక ధోని రివ్యూ తీసుకోవడంపై అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. డిఆర్ఎస్ అంటే ధోని రివ్యూ సిస్టం అంటూ కామెంట్ చేశారు.
READ ALSO : IPL ల్లో చాహల్ బిజీ…. శ్రేయస్ తో మళ్ళీ చాహల్ భార్య అడ్డంగా దొరికిపోయిందిగా!