Home » 2023 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఫిక్స్… హైదరాబాదులో ఆ మ్యాచులు!

2023 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఫిక్స్… హైదరాబాదులో ఆ మ్యాచులు!

by Bunty
Ad

క్రికెట్‌ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త. ఐపీఎల్‌ 2023 ప్రారంభం కాకముందే.. క్రికెట్‌ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త అందింది. ఈ సారి వన్డే వరల్డ్ కప్ 2023 మన భారత దేశంలోనే జరగనుంది. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. భారత్ వేదికగా జరగనున్న ఈ టోర్నీ అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19 వరకు జరిగే అవకాశం ఉంది. ఈ మెగా ఈవెంట్ కు హోస్ట్ అయిన బీసీసీఐ కనీసం డజన్ వేదికలను షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అహ్మదాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం, ఈ టోర్నీ ప్రారంభ వేదిక కానున్నది.

READ ALSO : టీమిండియాలో నో ఛాన్స్​.. ఇక సీరియల్​లో నటిస్తున్న శిఖర్​ ధావన్​!

Advertisement

అహ్మదాబాద్ స్టేడియంతో పాటు బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గౌహతి, హైదరాబాద్, కోల్కతా, లక్నో,

Advertisement

ఇండోర్, రాజ్కోట్, ముంబై 12 వేదికలను బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసినట్లుగా సమాచారం. మొత్తం ఈ టోర్నమెంట్ లో 46 రోజుల వ్యవధిలో మూడు నాకౌట్ లతో సహా 48 మ్యాచులు జరగనున్నాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఋతుపవనాల వల్ల ఎదురయ్యే సమస్యల కారణంగా వేదికలను ఖరారు చేయడంతో జాప్యం జరుగుతుంది. సాధారణంగా ఐసిసి కనీసం ఒక సంవత్సరం ముందుగానే ప్రపంచ కప్ షెడ్యూల్ ను రిలీజ్ చేస్తుంది.

READ ALSO : తండ్రి మరణంతో ఒంటరైన అమ్మ… తల్లికి మళ్లీ పెళ్లి చేసిన కొడుకులు

అయితే భారత ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు కోసం బీసీసీఐ వేచి చూస్తున్నట్లు సమాచారం. ఈ టోర్నీకి పన్ను మినహాయింపు, పాకిస్తాన్ జట్టుకు వీసా క్లియరెన్స్ వంటి రెండు అంశాలు బీసీసీఐ ముందున్నాయి. గత వారాంతంలో దుబాయ్ లో జరిగిన ఐసీసీ త్రైమాసిక సమావేశాల సందర్భంగా పాకిస్తాన్ బృందానికి వీసాలను భారత ప్రభుత్వం క్లియర్ చేస్తుందని బీసీసీఐ, ఐసిసి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

READ ALSO : విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్!

Visitors Are Also Reading