మెగాస్టార్ చిరంజీవి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు రామ్ చరణ్. తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు సాధించాడు. అలాంటి రామ్ చరణ్, రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా ఆల్ ఇండియా హీరోగా మారారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. శంకర్ డైరెక్షన్ లో రాబోతున్న ఆర్సి15 అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Advertisement
READ ALSO : ‘చమ్కీల అంగిలేసి’ పాట పాడిన ఈ సింగర్ గురించి తెలుసా…!
ఒకవేళ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీపై బయోపిక్ తీస్తే ఆ ఫిల్మ్ లో నటిస్తానని హీరో రామ్ చరణ్ అన్నాడు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే లో అతను పాల్గొన్నాడు. అయితే ఆ సమయంలో హోస్ట్ అడిగిన ఓ ప్రశ్నకు రాంచరణ్ బదిలించాడు. ఎటువంటి మూవీలో నటించడానికి ఇష్టపడతారని రామ్ ను అడిగారు. కొంతసేపు ఆలోచించిన చెర్రీ ఏదైనా స్పోర్ట్స్ అంశంతో ఉన్న ఫిల్మ్ లో నటించాలనుకుంటున్నట్లు చెప్పాడు. స్పోర్ట్స్ సబ్జెక్టు ఉన్న ఫిల్మ్ లో నటిస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Advertisement
READ ALSO : NTR నుంచి మనోజ్ వరకు 2 లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ స్టార్లు ?
విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తారని అడగ్గా, నటిస్తానని రామ్ చరణ్ అన్నాడు. కోహ్లీ అద్భుతమైన వ్యక్తి అని, చాలా ప్రేరణత్మక క్రికెటర్ అని, ఒకవేళ ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా ఆ ఫిల్మ్ లో నటిస్తానని చెర్రీ చెప్పాడు. తన ఫేస్ కట్ కూడా కోహ్లీ తరహాలోనే ఉంటుందన్న ఓ సిగ్నల్ కూడా రామ్ చరణ్ ఇచ్చాడు. కాగా, రామ్ చరణ్ నటించిన RRR చిత్రంలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే.
Advertisement
READ ALSO : RRR సినిమాలో ఎన్టీఆర్ ది ఓ సైడ్ పాత్ర – వేణు స్వామి సంచలనం