Home » తండ్రి మరణంతో ఒంటరైన అమ్మ… తల్లికి మళ్లీ పెళ్లి చేసిన కొడుకులు

తండ్రి మరణంతో ఒంటరైన అమ్మ… తల్లికి మళ్లీ పెళ్లి చేసిన కొడుకులు

by Bunty

తాము ప్రేమించిన‌వాళ్లు ఎక్క‌డున్నా సంతోషంగా ఉండాల‌ని కోరుకోవ‌డమే నిజ‌మైన ప్రేమ‌. కానీ ఇటీవ‌ల కాలంలో అలా కోరుకోవడం కాదు క‌దా ఏకంగా ఈ లోకంలోనే లేకుండా చేస్తున్నారు. ప్రేమంటే కొందరికి ప్రేమించడం, మర్చిపోవడం అన్నట్లుగా మార్చుకుంటారు. అయితే.. పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. అయితే ఇద్దరు కొడుకులు తమ తల్లికి రెండో పెళ్లి చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కల్లకురిచి గ్రామంలో చోటుచేసుకుంది. వలయంపట్టు గ్రామానికి చెందిన సెల్వి అనే మహిళకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు భాస్కర్, చిన్న కొడుకు వివేక్ లు. చిన్నతనంలోనే తమ తండ్రిని కోల్పోయారు.

READ ALSO : మంచు కుటుంబంలో కొత్త కోడలు హవా… అందరిని తొక్కేస్తోందా?

2009లో వారి తండ్రి చనిపోయాడు. భాస్కర్ డిగ్రీ చదువుతుండగా తన టీచర్ మీ అమ్మకు రెండో పెళ్లి ఎందుకు చేయకూడదని ప్రశ్నించడంతో భాస్కర్ చాలా బాధపడ్డాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత భాస్కర్ పుస్తకాలు బాగా చదివేవాడు. పెరియర్ రాసిన పుస్తకాలు ఎక్కువగా చదవడం వల్ల అందులో ఉండే వితంతు పునర్వివాహాల గురించి చదివి స్ఫూర్తి పొందాడు. ఇంట్లో తన తల్లి భర్తను కోల్పోయి ఒంటరిగా ఉంటుందని, తల్లికి మళ్లీ ఎందుకు పెళ్లి చేయకూడదు అనే విషయంలో బాగా ఆలోచించాడు. తమ్ముడు వివేక్ తో చర్చించి ఇద్దరు తమ నిర్ణయాన్ని తల్లికి చెప్పారు. సెల్వి కొడుకుల ఆలోచనకు ఆశ్చర్యపోయింది. మొదట ఇద్దరు కొడుకులను తిట్టిపోసిన ఆ తర్వాత కొడుకు రోజు బుజ్జగించి బ్రతిమాలడంతో పిల్లల కోసం ఒప్పుకుంది.

READ ALSO : భర్తతో గొడవలు… నిహారిక కోసం రంగంలోకి దిగిన చిరంజీవి?

ఇతరులు తన గురించి ఏమనుకుంటే ఏమని తన పిల్లలు సంతోషంగా ఉండటమే కావాలని అనుకుంది. చివరి రోజుల్లో పిల్లలపై ఆధారపడకుండా తనకంటూ ఓ తోడు ఉండాలనుకుని, భర్త చనిపోయాక తనకు ఎదురైన అవమానాలను, సూటిపోటి మాటలను గుర్తుచేసుకుంది. తాను ఎందరికో ఆదర్శం కావాలని నిర్ణయించుకొని పెళ్లికి ఒప్పుకుంది. ఏలుమలై అనే రైతుతో సెల్వి పెళ్లి జరిగింది. పెళ్లికి బంధువులు ఎవరూ రాకపోయినా ఇద్దరు కొడుకులు అమ్మకు మరో పెళ్లి చేసి రుణం తీర్చుకున్నారు.

READ ALSO : పెళ్లికి ముందే నిహారికకు లవ్ ఎఫైర్లు ఉన్నాయా…?

Visitors Are Also Reading