Home » “బలగం” వివాదంపై జబర్దస్త్ వేణు క్లారిటీ.. అసలు కథ ఎవరిదంటే ?

“బలగం” వివాదంపై జబర్దస్త్ వేణు క్లారిటీ.. అసలు కథ ఎవరిదంటే ?

by Bunty
Ad

 

కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా బలగం. దిల్ రాజు తన కొత్త ప్రొడక్షన్ హౌస్ లో తక్కువ బడ్జెట్ లోనే ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాపై ఓ వివాదం చెలరేగుతోంది. గడ్డం సతీష్ అనే వ్యక్తి ఈ కథ నాది, నా స్టోరీని కాపీ కొట్టి సినిమా చేశారు అని ఆరోపించాడు.

read also : Amigos OTT Release: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Advertisement

ఈ వివాదం పై తాజాగా దర్శకుడు వేణు స్పందించారు. దర్శకుడు వేణు మాట్లాడుతూ, గడ్డం సతీష్ బలగం కథ నాదే అనడం హాస్యాస్పదం అన్నారు వేణు. బలగం కథ మా కుటుంబంలో జరిగిన కథ. బలగం మా నాన్న చనిపోయినప్పుడు మెదిలిన కథ అన్నారు. మాది ఉమ్మడి కుటుంబం. మా కుటుంబంలో సుమారు 100 మంది ఉంటాం. కాకి ముట్టడం అనేది తెలంగాణ సాంప్రదాయం కాదు, తెలుగు సాంప్రదాయం అన్నారు.

Advertisement

read also : Balagam Movie Review : “బలగం” సినిమా రివ్యూ

సతీష్ మా సినిమాను అభాసుపాలు చేయడం సబబు కాదు. రచయితల సంఘాన్ని సతీష్ గడ్డం ఎందుకు సంప్రదించలేదు. దిల్ రాజు ఈ సినిమాను తీయకపోతే తెలంగాణ సాంస్కృతిలో ఈ పాయింట్ ప్రపంచానికి ఎలా తెలిసేది? బలగం సినిమా వల్ల ఎన్నో మంచి కథలు రాబోతున్నాయి. దిల్ రాజుతో కాదు నాతో మాట్లాడండి. దిల్ రాజు బొమ్మను వాడి సతీష్ చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. బలగం సినిమాకు దిల్ రాజు ముందు ఉండటం వల్ల తెలంగాణ సాంస్కృతి ఏంటో తెలిసింది అని అన్నారు వేణు.

read also : తెలంగాణలో TRS పేరుతో మరో రాజకీయ పార్టీ..! BRSకు పెద్ద దెబ్బేనా..!

Visitors Are Also Reading